ప్రధాన మంత్రి కార్యాలయం
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 7:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు శ్రీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.
ఆగస్టు-2025లో టియాంజిన్‌లో జరిగిన తమ చివరి సమావేశం నుంచి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొనసాగుతున్న స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. ఇరు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించారు. భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదు... ఇరుపక్షాలు పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల మార్గనిర్దేశంలో ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత అత్యంత ఆవశ్యకమైన ప్రాతిపదిక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు పాటించాల్సిన అవసరాన్నీ ఆయన ఉద్ఘాటించారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాల రాజకీయ దృక్కోణం, ఇరు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని... సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం పట్ల ఇరువురు నేతలు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.
ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని గుర్తించిన ఇరువురు నేతలు... సాంస్కృతిక మార్పిడులను, వ్యాపార సంబంధాలను, మెరుగైన రవాణాను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరాన్నీ స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాల విషయంలో నిర్మాణాత్మక వాణిజ్య అసమతుల్యత, సరఫరా వ్యవస్థ సంబంధిత సమస్యలు సహా ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని... అర్థవంతమైన, అంచనా వేయదగిన వాణిజ్య అవకాశాలను సులభతరం చేయాల్సిన అవసరాన్నీ వారు ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఇరుపక్షాలు తమ ఉమ్మడి అవగాహనను మరింత విస్తరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
బ్రిక్స్ అధ్యక్ష హోదా కోసం భారత్‌కు చైనా అందిస్తున్న మద్దతును, బ్రిక్స్ సదస్సు-2026 విజయవంతంలో ఆ దేశ సహకారాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
***
(రిలీజ్ ఐడి: 2309908)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam