ప్రధాన మంత్రి కార్యాలయం
రెండు దశాబ్దాల బ్రిక్స్ సహకారానికి గుర్తుగా తపాలా బిళ్ళల విడుదల
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 6:16PM by PIB Hyderabad
బ్రిక్స్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా, ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో రెండు స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేశారు.
“బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026” అని రాసి ఉన్న ఈ స్మారక తపాలా బిళ్ళ... చర్చలు, సహకారానికి ఒక విలువైన వేదికగా బ్రిక్స్ పరిణామాన్ని చాటిచెబుతుంది.
ఈ రెండు తపాలా బిళ్ళలు... “అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” అనే ఇతివృత్తం కింద, 2026 బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ప్రాధాన్యాలనూ ప్రతిబింబిస్తున్నాయి.
మొదటి తపాలా బిళ్ళ పరస్పర గౌరవం, అవగాహన, సంఘీభావ స్ఫూర్తికి వేదికగా బ్రిక్స్ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తోంది. రెండో తపాలా బిళ్ళ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో "మానవత్వమే ప్రథమం", ప్రజలకే ప్రాధాన్యం" అనే భారత దృక్పథం, చిహ్నాలను ప్రదర్శిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2309616)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam