రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో ముగిసిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ టేబుల్ టాప్ విన్యాసాలు

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 11:38AM by PIB Hyderabad

కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ (సీఎస్‌సీ) ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో (ఈఎన్‌సీ) నిర్వహించిన మూడు రోజుల టేబుల్ టాప్ విన్యాసాలు (టీటీఎక్స్) 2026 సెప్టెంబర్ 12న విజయవంతంగా ముగిశాయి. 2026 సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఈ విన్యాసాలలో తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్) రియర్ అడ్మిరల్ మనోజ్ జా ప్రారంభోపన్యాసం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) అక్రమ సముద్ర కార్యకలాపాలకు సమన్వయ ప్రతిస్పందనను అభివృద్ధి చేయడంపై ఇది ప్రధానంగా దృష్టి సారించింది.

సీఎస్‌సీ సభ్య దేశాలు, పరిశీలక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, సముద్ర భద్రతా నిపుణులు 72 గంటలకు పైగా తీవ్రతతో కూడుకున్న సిమ్యులేటెడ్ ఆపరేషనల్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన చర్చలు సముద్ర ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా.. చట్టవిరుద్ధమైన, నివేదించని, అనియంత్రిత (ఐయూయూ) చేపల వేట వంటి సంక్లిష్టమైన, సంప్రదాయేతర భద్రతా సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించాయి.

సమష్టి సముద్ర డొమైన్ అవగాహనను (ఎండీఏ) మెరుగుపరచడానికి పాల్గొనేవారు ఇప్పటికే ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపీ) సమీక్షించారు. దీనితో పాటు సమాచార భాగస్వామ్య ఏర్పాట్లను క్రమబద్ధీకరించారు. 

ఈ విన్యాసాలు ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడానికి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ దేశాల సమష్టి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. ఇది 'మహాసాగర్' (మ్యూచవల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ యాక్సెస్) దృక్పథానికి అనుగుణంగా ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2309591) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil