బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్షాకాలంలోనూ క్యాప్టివ్‌ గనుల్లో పెరుగుతున్న ఉత్పత్తి

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 2:01PM by PIB Hyderabad

బొగ్గు ఉత్పత్తిలో క్యాప్టివ్ గనులు (సొంత అవసరాల కోసం నిర్వహించే గనులు) కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటి ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. క్యాప్టివ్ గనుల ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 167.44 మిలియన్ టన్నులు ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 184 మిలియన్ టన్నులకు పెరిగింది. దాదాపు 10.10 శాతం వృద్ధి నమోదైంది. కేవలం వాణిజ్య గనుల ద్వారా సుమారు 26 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. క్యాప్టివ్‌, వాణిజ్య గనులు రెండూ కలిసి 2025-26లో 210 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి. అంతకుముందు ఏడాది ఈ ఉత్పత్తి 190.95 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఇలా మొత్తం ఉత్పత్తి వంద కోట్ల టన్నులు దాటడం ఇది వరుసగా రెండో ఏడాది. ఈ మొత్తం ఉత్పత్తిలో క్యాప్టివ్, వాణిజ్య గనుల వాటానే దాదాపు 21 శాతంగా ఉంది.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వృద్ధి కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 65.78 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. 2026 సెప్టెంబర్‌ 10 వరకు క్యాప్టివ్ గనుల నుంచి 68.98 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అంటే సుమారు 5 శాతం వృద్ధితో అదనంగా 3.2 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఉత్పత్తి కూడా 10.12 శాతం అధికంగా నమోదైంది. బొగ్గు తవ్వకం, దానిని రవాణా చేయడం అత్యంత కష్టంగా ఉండే వర్షాకాలంతో కూడిన ఏడాది తొలి అయిదు నెలల్లోనే ఈ పెరుగుదల సాధ్యమవ్వడం విశేషం. క్యాప్టివ్‌ గనుల నుంచి బొగ్గు పంపిణీ కూడా గత ఏడాది కంటే మెరుగ్గా ఉంది. క్యాప్టివ్ గనుల నుంచి గతేడాది 71.43 మిలియన్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 75.68 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరా జరిగింది. ఇది 5.94 శాతం వృద్ధిని, 4.25 మిలియన్ టన్నుల అదనపు సరఫరాను సూచిస్తుంది.

 

వర్షాకాలం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో క్యాప్టివ్‌ గనుల ఉత్పత్తి వేగం మరింత పెరుగుతున్నట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు పది రోజుల్లో క్యాప్టివ్‌ గనుల నుంచి 4.12 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 4.21 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరా చేశాయి.

ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సామర్థ్యానికి కొత్త సామర్థ్యం కూడా తోడవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20.67 మిలియన్ టన్నుల గరిష్ట సామర్థ్యం కలిగిన 9 క్యాప్టివ్‌, వాణిజ్య గనులు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వీటిలో 7.51 మిలియన్‌ టన్నుల గరిష్ఠ సామర్థ్యం కలిగిన 3 గనులు ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించాయి. మిగిలిన 6 గనులు కూడా ఈ ఏడాదిలో త్వరలో ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.

 

ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యాప్టివ్‌ గనుల బొగ్గు ఉత్పత్తి 190 మిలియన్‌ టన్నులను దాటుతుందని అంచనా వేస్తున్నారు. వాణిజ్య గనుల ఉత్పత్తిని కూడా కలిపితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు విభాగాల మొత్తం బొగ్గు ఉత్పత్తి 228 మిలియన్‌ టన్నులను మించే అవకాశం ఉందని భావిస్తున్నారు.        


(రిలీజ్ ఐడి: 2309188) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी