ప్రధాన మంత్రి కార్యాలయం
నాందేడ్ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 9:11AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని నాందేడ్ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) ద్వారా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 పరిహారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"మహారాష్ట్రలోని నాందేడ్ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 పరిహారాన్ని అందిస్తాం: పీఎం శ్రీ నరేంద్ర మోదీ"
***
(రిలీజ్ ఐడి: 2309169)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam