ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ క్షేమం, జ్ఞానం, హితం కలగాలని కోరుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 10:02AM by PIB Hyderabad
అందరికీ శ్రేయస్సు, శుభాలు, సురక్ష, శాంతి, జ్ఞానం, హితం కలగాలని ఆకాంక్షిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. భగవాన్ ఇంద్రుడు, భగవాన్ సూర్యుడు, భగవాన్ గరుడుడు, భగవాన్ బృహస్పతిల ఆశీర్వాదాలు లభించాలనే అభ్యర్థన ఈ సుభాషితంలో ఇమిడి ఉంది.
‘‘స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఈ సుభాషితం ‘‘యశోవంతుడు భగవాన్ ఇంద్రుడు మనకు శ్రేయాన్ని అనుగ్రహించుగాక. యావత్తు విశ్వానికీ సాక్షీభూతుడూ, అన్ని ప్రాణులను పోషించే వాడూ అయిన భగవాన్ సూర్యుడు మనకు శుభాలను ప్రసాదించు గాక. విఘ్న వినాశకుడైన భగవాన్ గరుడుడు మన అందరినీ రక్షించుగాక. బుద్ధికి అధిపతి అయిన భగవాన్ బృహస్పతి శాంతినీ, వివేకాన్నీ, హితాన్నీ తన ఆశీస్సుల రూపంలో మనకు అందించు గాక’’ అనే సందేశాన్ని సూచిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2308657)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam