ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్- 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 9:14PM by PIB Hyderabad
ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్- 2026 (జీఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026ను ఉద్దేశించి ప్రసంగించాను.
భారతదేశ అద్భుతమైన ఫిన్‌టెక్ ప్రయాణం, యూపీఐ విజయం గురించి మాట్లాడాను.
వీటిని ప్రతిపాదించాను:
యూపీఐ ప్రపంచ వ్యాప్త విస్తృతిని పెంచడం.
ఫిన్‌టెక్ సేవలను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా క్రెడిట్, బీమా, పొదుపులు, పెట్టుబడులు, పింఛన్ల వరకు విస్తరించడం.
ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం.
అత్యుత్తమ సైబర్ భద్రత, నైతికపరమైన డేటా రక్షణ.
బలమైన ఫిన్‌టెక్ వినియోగదారుల రక్షణ సూచీ, మరింత మెరుగైన ఆవిష్కరణలు.”
“భారతదేశ సంస్కరణల వేగం ఇకపై మరింత పుంజుకుంటుంది.”
“భారతదేశ ఫిన్‌టెక్ రంగం కోసం నాలుగు ప్రాధాన్యతలను పంచుకున్నాను.”
***
(రిలీజ్ ఐడి: 2308079)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9