బొగ్గు మంత్రిత్వ శాఖ
06.09.2026 నాటికి విద్యుత్ రంగానికి పెరిగిన బొగ్గు సరఫరా…
రైలు బోగీల సంఖ్య 444కు పెరగటం రోజువారీ పురోగతికి సూచిక
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 10:12AM by PIB Hyderabad
విద్యుత్ రంగానికి బొగ్గు రవాణా చేయటంలో నాలుగు రోజులుగా క్రమంగా పురోగతి కనిపిస్తోంది. 03.09.2026 నాటికి 370 రైలు బోగీల బొగ్గు సరఫరా జరగ్గా... 06.09.2026 నాటికి 444 బోగీలకు పెరిగింది. ఇది రోజువారీగా 74 బోగీల నికర పెరుగుదలను సూచిస్తుంది. ఇందులో కేవలం 06.09.2026న ఒక్కరోజే 31 బోగీల బొగ్గు సరఫరా జరగటం విశేషం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరాను పెంచటానికి కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థలు, ఎస్‌సీసీఎల్, సొంత గనుల నిర్వాహకుల నిరంతర కృషిని ఇది ప్రతిబింబిస్తోంది.
రోజువారీగా విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా కోసం బొగ్గు నింపిన రైలు బోగీలు
నాలుగు రోజుల వ్యవధిలో విద్యుత్ రంగానికి సరఫరా చేసేందుకు బొగ్గు నింపిన బోగీల వివరాలు:
03.09.2026: రోజుకు 370 బోగీలు
04.09.2026: రోజుకు 387 బోగీలు (ముందురోజుతో పోల్చితే 17 బోగీలు ఎక్కువ )
05.09.2026: రోజుకు 413 బోగీలు (ముందురోజుతో పోల్చితే 26 ఎక్కువ)
06.09.2026: రోజుకు 444 బోగీలు (ముందురోజుతో పోల్చితే 31 ఎక్కువ)
నాలుగు రోజుల వ్యవధిలో సగటున రోజుకు 74 బోగీల (సుమారు 20%)లతోపరిస్థితి మెరుగుపడింది. 06.09.2026 నాటికి రోజుకు 444 బోగీలను బొగ్గుతో నింపారు.
06.09.2026 నాటికి కంపెనీల వారీగా పురోగతి
దాదాపు ప్రతి బొగ్గు ఉత్పత్తి సంస్థ 06.09.2026న ముందు రోజుతో పోల్చితే బోగీల్లో బొగ్గు నింపటంలో మెరుగుదలను నమోదు చేసింది.
ఎంసీఎల్ సంస్థ అత్యధికంగా ఒక్కరోజులోనే 12 బోగీల వృద్ధిని నమోదు చేసి, రోజుకు 111 బోగీల బొగ్గును సరఫరా చేసే స్థాయికి చేరుకుంది.
క్యాపిటివ్ బ్లాక్ లోడింగ్ 6 బోగీలు పెరగటంతో రోజుకు 72 బోగీలకు చేరుకుంది.
బీసీసీఎల్ పనితీరు 8 బోగీలకు మెరగవటంతో రోజుకు 25 బోగీలకు చేరుకుంది.
ఎన్‌సీఎల్ లోడింగ్ 3 బోగీలు పెరిగి రోజుకు 35 బోగీలకు, ప్రైవేట్ వాషరీ (పీడబ్ల్యూ), గూడ్‌షెడ్స్ లోడింగ్ 3 బోగీలకు పెరగటంతో రోజుకు 42 బోగీల బొగ్గును లోడ్ చేస్తుంది.
సీసీఎల్, ఎస్ఈసీఎల్ వరుసగా 2, 1 బోగీల చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. దీంతో రోజుకు వాటి లోడింగ్ 36, 46 బోగీలకు చేరుకుంది.
ఈసీఎల్, డబ్ల్యూసీఎల్ సంస్థలు ముందురోజు లోడింగ్ స్థాయిలనే కొనసాగించటంతో వరుసగా 23, 29 బోగీల లోడింగ్ జరుగుతుంది.
ఫలితంగా 06.09.2026 నాటికి మొత్తం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) సైడింగ్ లోడింగ్ రోజుకు 305 బోగీలకు పెరిగింది. ముందురోజుతో పోల్చితే అదనంగా 26 బోగీల్లో లోడింగ్ జరిగింది.
క్రీయాశీలకంగా పర్యవేక్షణలో ఉన్న కీలకమైన ప్లాంట్లు
నిబంధనల ప్రకారం ఉండాల్సిన నిల్వలో 25 శాతం కంటే తక్కువ నిల్వలున్న కీలకమైన థర్మల్ ప్లాంట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఈ ప్లాంట్లలో పరిస్థితిని మరింత మెరుగుపరచటానికి బొగ్గు సరఫరా చర్యలు ఇప్పటికే అమలవుతున్నాయి. విద్యుత్ రంగానికి మెరుగైన బొగ్గు సరఫరాను కొనసాగించేందుకు, అవసరాలను తీర్చేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ కట్టుబడి ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2307361)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10