రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ విజేతలను ప్రకటించిన ఎన్‌హెచ్‌ఏఐ


జాతీయ రహదారి ప్రాజెక్టుల వ్యాప్తంగా సుస్థిర హరిత పద్ధతులను అవలంబించే నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ఈ పురస్కారాల లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 03 SEP 2026 5:37PM by PIB Hyderabad

జాతీయ రహదారుల వెంబడి ఆరోగ్యకరమైన మొక్కల పెంపకం పద్ధతులను ప్రోత్సహించడం కోసం, జాతీయ రహదారుల సుందరీకరణ, మొక్కల పెంపకం నిర్వహణలో ఉత్తమ పద్ధతులను గుర్తించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ‘గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ను ఏర్పాటు చేసింది. క్లోవర్ లీవ్‌లు, ఇంటర్‌చేంజ్, టోల్ ప్లాజాలు, సర్వీస్ ఏరియాల కోసం అవెన్యూ ప్లాంటేషన్స్, మీడియన్ ప్లాంటేషన్స్, ప్లాంటేషన్ ఇన్ ల్యాండ్ పార్శిల్స్ అనే మూడు విభాగాల్లో ‘గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ విజేతలను ప్రకటించారు. జాతీయ రహదారి ప్రాజెక్టుల వెంబడి చేపట్టిన మొక్కల పెంపకం ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న ఎన్‌హెచ్ఏఐ ఫీల్డ్ కార్యాలయాలు, కాంట్రాక్టుదారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఈ పోటీలో పాల్గొనడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.

విజేతల ప్రకటన

కేటగిరీ- I: అవెన్యూ ప్లాంటేషన్స్

1వ బహుమతి

ప్రాజెక్ట్: ఆర్‌ఓ-విజయవాడ పరిధి, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌హెచ్ 16 పై చిలకలూరిపేట బైపాస్‌ ఆరు వరుసల విస్తరణ

2వ బహుమతి

ప్రాజెక్ట్: గుజరాత్‌లో ఎనిమిది వరుసల వడోదర-కిమ్ ఎక్స్‌ప్రెస్‌వే, వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని పద్ర నుంచి వడోదర సెక్షన్

ఆర్ఓ-గాంధీనగర్ పరిధి

3వ బహుమతి

ప్రాజెక్ట్: ఎన్‌హెచ్-925 గగారియా-బఖాసర్ సెక్షన్, ఎన్‌హెచ్-925A సత్తా-గాంధవ్ సెక్షన్, ఆర్ఓ -జైపూర్ పరిధి

ప్రోత్సాహక బహుమతి

 

ప్రాజెక్ట్: ఆర్ఓ-మదురై పరిధి,

త్రిచీ బైపాస్‌తో సహా ఎన్‌హెచ్-210, ఎన్‌హెచ్-336, 36 & 536ల్లోని త్రిచీ - కారైకుడి సెక్షన్‌లో సంబంధిత సంఘటనల నిర్వహణతో కూడిన వార్షిక నిర్వహణ.

 

కేటగిరీ II: మీడియన్ ప్లాంటేషన్స్:

1వ బహుమతి

ప్రాజెక్ట్: ఆర్‌ఓ-హైదరాబాద్ పరిధి,

జాతీయ రహదారి 163 కేఎమ్ హైదరాబాద్-యాదగిరి సెక్షన్ నాలుగు వరుసల విస్తరణ

2వ బహుమతి

ప్రాజెక్ట్: గుజరాత్‌లో ఎనిమిది వరుసల వడోదర-కిమ్ ఎక్స్‌ప్రెస్‌వే, వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని సంపా నుంచి పద్ర సెక్షన్ వరకు

ఆర్ఓ-గాంధీనగర్ పరిధి

3వ బహుమతి

 

ప్రాజెక్ట్: వారణాసి రింగ్ రోడ్, ప్యాకేజీ-I, ఎన్‌హెచ్-31లోని హరహువా నుంచి సందహా వరకు గల సెక్షన్,

ఆర్ఓ-అప్ ఈస్ట్ (వారణాసి) పరిధి

 

కేటగిరీ III: ప్లాంటేషన్ ఇన్ ల్యాండ్‌ పార్శిల్స్:

1వ బహుమతి

ప్రాజెక్ట్: ఎన్‌హెచ్-44 పై జామ్తా క్లోవర్ లీఫ్, ఆక్సిజన్ బర్డ్ పార్క్

ఆర్‌ఓ నాగ్‌పూర్ పరిధి,

2వ బహుమతి

ప్రాజెక్ట్: టోలింగ్ కింద ప్రజా నిధులతో నడుస్తున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం. కార్యాచరణ, నిర్వహణ, బదిలీ (టీవోటీ) బండిల్-7, ఎన్ఈ-II - దుహై ఇంటర్‌చేంజ్ వద్ద ల్యాండ్ పార్శిళ్లు.

ఆర్ఓ-ఢిల్లీ పరిధి

3వ బహుమతి

ప్రాజెక్ట్: లక్నో-అయోధ్య రోడ్, లక్నో ఔటర్ రింగ్ రోడ్ కూడలి జంక్షన్ - లూప్ ప్రాంతాల్లో మియావాకి మొక్కల పెంపకం,

ఆర్ఓ-యూపీ వెస్ట్ (లక్నో) పరిధి

 

ఎంట్రీల నామినేషన్, మూల్యాంకనం

ఎన్‌హెచ్ఏఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ పురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఎన్‌హెచ్ఏఐ దేశవ్యాప్తంగా అందిన 86 నామినేషన్లతో గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ పురస్కారాల దరఖాస్తులకు ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. వీటిలో అవెన్యూ ప్లాంటేషన్లకు 27, మీడియన్ ప్లాంటేషన్లకు 36, ల్యాండ్ పార్శిళ్ళ ప్లాంటేషన్‌కు 23 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లలో జియో-ట్యాగ్ చేసిన ఫోటోగ్రాఫ్‌లు, డ్రోన్ వీడియోలు, సైట్-నిర్దిష్ట ప్లాంటేషన్ ప్రణాళికలు, ప్లాంటేషన్ మనుగడ రేటు సంబంధిత డేటాతో కూడిన ప్రజెంటేషన్లు ఉన్నాయి.

ప్రాథమిక పరిశీలన తరువాత దరఖాస్తుల తుది మూల్యాంకనం కోసం ప్రతి విభాగంలో ఐదు చొప్పున మొత్తం 15 నామినేషన్లను ఎంపిక చేశారు. ఒక సమగ్ర మదింపు విధానం ఆధారంగా ఈ మూల్యాంకనం నిర్వహించారు. నాటిన మొక్కల మనుగడ రేటుకు ఇందులో అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయా ప్రదేశాల్లో నిర్ధిష్ట మొక్కల పెంపకం గురించిన కార్యాచరణ ప్రణాళికలు, మొక్కలు నాటే పనుల సమయం, గుంతల పరిమాణం, నాటే పదార్థం నాణ్యత, రక్షణ చర్యలు, ఆమోదించిన నమూనా ప్రకారం అమలు, జాతుల వైవిధ్యం, అనుకూలత, స్థానిక జాతుల వినియోగం వంటివి ఇతర అంశాల్లో భాగంగా ఉన్నాయి. నాణ్యత, సుస్థిరత, సమర్థత, జాతీయ రహదారుల నెట్‌వర్క్ వ్యాప్తంగా విస్తృతంగా పునరావృతం చేయగల సామర్థ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

2015 గ్రీన్ హైవేస్ పాలసీలో నిర్దేశించిన విధంగా, 2025లో ‘గ్రీన్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ను ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధితో పర్యావరణ సుస్థిరతను అనుసంధానించాలనే ఎన్‌హెచ్ఏఐ నిబద్ధతను ఈ పురస్కారాలు మరింత బలోపేతం చేస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2306701) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil