ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ గుజరాతీ సంగీతకారుడు శ్రీ గౌరాంగ్ వ్యాస్ కన్నుమూత... ప్రధానమంత్రి సంతాపం
గుజరాతీ సంగీత జగతికి ఆయన అందించిన అమూల్య సేవలను స్మరించుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 12:25PM by PIB Hyderabad
గుజరాతీ సంగీత జగతిలో ప్రముఖ సంగీతకారుడైన శ్రీ గౌరాంగ్ వ్యాస్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ గౌరాంగ్ వ్యాస్ తండ్రి అవినాశ్ వ్యాస్ సుసంపన్న సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతూ గుజరాతీ సంగీత రంగంలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఆయన మరణంతో గుజరాత్ ఒక ప్రతిభాశాలి సృజనశీలిని కోల్పోయిందని, గుజరాతీ సంగీత లోకానికి ఆయన అందించిన అమూల్యమైన తోడ్పాటును ప్రజలు సదా స్మరించుకొంటూనే ఉంటారని శ్రీ మోదీ అన్నారు.
ఈ లోకాన్ని వీడిన ఆత్మకు శాంతి కలగాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబానికి, శ్రీ గౌరాంగ్ వ్యాస్ అసంఖ్యాక అభిమానులకు ప్రధానమంత్రి సంతాపాన్ని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గుజరాతీ భాషలో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
***
(రిలీజ్ ఐడి: 2306335)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam