జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆన్‌లైన్ మాధ్యమం మైగవ్ ద్వారా ‘2026 మానవ హక్కుల క్విజ్-2026‘ను ప్రారంభించిన ఎన్‌హెచ్ఆర్‌సీ ఇండియా.. త్వరలోనే ఎన్‌హెచ్ఆర్‌సీ ఇండియా 33వ స్థాపక దినోత్సవం
14 ఏళ్లు, అంతకు మించిన వయసున్న
భారతీయ పౌరులకు 2026 అక్టోబరు 10 వరకూ ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 5:55PM by PIB Hyderabad
భారత్ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ, ఇండియా) త్వరలో తన 33వ స్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ‘మైగవ్’ [MyGov] సహకారంతో ‘హ్యూమన్ రైట్స్ క్విజ్ 2026: సెలిబ్రేటింగ్ లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ’ని ఎన్‌హెచ్ఆర్‌సీ, ఇండియా ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్ ప్రశ్నజవాబుల పోటీ (క్విజ్) 2026 అక్టోబరు 10 వరకు మైగవ్ వేదికలో అందుబాటులో ఉంటుంది. దీనిలో 14 ఏళ్లు, అంతకు మించిన వయసున్న భారతీయ పౌరులు పాల్గొనవచ్చు.
మానవ హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ చట్టం (పీహెచ్ఆర్ఏ)-1993తో పాటు దేశవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడం, వాటి పరిరక్షణకు ఎన్‌హెచ్ఆర్‌సీ నిర్వర్తించే విధులు, ఈ సంస్థకు ఉన్న అధికారాలు, బాధ్యతల గురించి అందరికీ అవగాహనను కలిగించడం ఈ క్విజ్ పోటీ ఉద్దేశం.
దీనిలో పాల్గొనే వారు కనీసం 15 ప్రశ్నలకు 300 సెకండ్ల లోపల సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఒకటో, రెండో, మూడో స్థానాల్లో నిలిచే వారికి వరుసగా రూ.15,000, రూ.10,000, రూ. 5,000 నగదు బహుమతులను, ధ్రువపత్రాలను ప్రదానం చేస్తారు. అదనంగా మరో ఏడు మంది విజేతలకు ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున కన్సొలేషన్ ప్రైజ్ రూపంలో అందిస్తారు.
మానవ హక్కుల క్విజ్‌లో పాల్గొనడానికి సమగ్ర మార్గదర్శకాలను మైగవ్ వెబ్‌సైట్‌లో
https://quiz.mygov.in/quiz/human-rights-quiz-2026-celebrating-life-liberty-equality-and-dignity/ అని పేర్కొని లాగాన్ అయ్యి తెలుసుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2305886)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6