రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మురాదాబాద్ డివిజన్లో మిగతా 712 కి.మీ. మార్గంపై కవచ్ 4.0 సదుపాయ కల్పనకు రూ.170 కోట్ల విలువైన ప్రతిపాదన... ఆమోదించిన భారతీయ రైల్వే

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 11:03AM by PIB Hyderabad

నార్దర్న్ రైల్వేలోని మురాదాబాద్  డివిజన్లో మిగిలిన 712 రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎమ్) సెక్షన్లపై ‘కవచ్ 4.0’ వర్షనును పూర్తి చేయడానికి భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపింది. ఈ పనికి మొత్తం రూ.170 కోట్లు ఖర్చు పెడతారు.
దేశీయ ఆటోమేటిక్ రైలు రక్షక వ్యవస్థను కల్పించడం ద్వారా డివిజన్లో రైల్వే భద్రత సంబంధిత మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. కవచ్ 4.0 పూర్తి స్థాయిలో అమలైతే గుర్తించిన సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు ఆధునిక భద్రత వ్యవస్థ సమకూరుతుంది.
దేశీయ కవచ్ సాంకేతికతతో రైల్వే భద్రత పటిష్ఠం
దేశీయంగా అభివృద్ధిపరిచిన ఆటోమేటిక్ రైలు రక్షక వ్యవస్థ (ఏటీపీ)యే ‘కవచ్’ . రాకపోకల్లో భద్రతను పెంచడానికి దీనిని రూపొందించారు.  ఇది అపాయకర సిగ్నల్‌ను దాటి ముందుకు పోవడాన్ని (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్.. ఎస్‌పీఏడీ) అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. సురక్షితం కాని స్థితుల బారిన పడకుండా తప్పించుకోవడానికి అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకు వేస్తుంది. సంకట స్థితుల్లో రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. డీకొట్టే ముప్పులను చాలా వరకు తగ్గిస్తుంది.
ఈ కార్యక్రమం.. భారతీయ రైల్వే నెట్‌వర్కు అంతటా కవచ్ రక్షణను విస్తరించే, రైల్వే సిగ్నలింగును, రైలు రక్షక వ్యవస్థలను ఆధునికీకరించే దిశగా చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఓ భాగం.

 

***


(రిలీజ్ ఐడి: 2305389) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada