సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌లతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న సామాజిక న్యాయం, సాధికారతా విభాగం.. తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

పిల్లలు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని పెంచేలా...

దేశవ్యాప్తంగా 200 పాఠశాలల్లో కార్యక్రమం

ప్రతి తరమూ కలిసి సాగుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న ప్రధాని దార్శనికతను ప్రతిబింబించేలా ప్రణాళిక

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 7:28PM by PIB Hyderabad

రామకృష్ణ మఠంరామకృష్ణ మిషన్ (ఆర్‌కేఎం)తో.. కేంద్ర సామాజిక న్యాయంసాధికారతా మంత్రిత్వశాఖ పరిధిలోని సామాజిక న్యాయంసాధికారతా విభాగం (డీవోఎస్‌జేఈరేపు ఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ‘తరాల మధ్య అనుబంధా’న్ని పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమం అమలుకు ఇది తోడ్పాటునందిస్తుంది.

న్యూఢిల్లీ పహాడ్‌గంజ్‌లోని రామకృష్ణ మిషన్‌లో ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం జరగనుందికేంద్ర సామాజిక న్యాయంసాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్సహాయ మంత్రి శ్రీ బి.ఎల్వర్మ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారుమంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పంత్సంయుక్త కార్యదర్శి శ్రీ సజీశ్ కుమార్ ఎన్రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానంద పాల్గొంటారు.

పాఠశాల వ్యవస్థ ద్వారా.. పిల్లలుతల్లిదండ్రులువారి తల్లిదండ్రుల మధ్య భావోద్వేగసాంస్కృతిక అనుబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యంఇందుకోసం ఆటపాటలుశాస్త్రీయ ఆధారాలతో కూడిన వినూత్న కార్యకలాపాలను నిర్వహించనున్నారు.

పెద్దలను గౌరవించడంసమ్మిళిత అభివృద్ధి సాధనలకు ప్రధానమంత్రి ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందిప్రతి తరమూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే.. ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్’ అనే సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుందని ఇది స్పష్టం చేస్తోంది.

ఈ భాగస్వామ్యం కింద.. విస్తరణకు అనువైన ఒక నమూనాను రూపొందించిదేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారుఈ కార్యక్రమంలో భాగంగా సహాధ్యయన క్రీడలుద్విభాషా రిసోర్స్ సెంటర్ వెబ్‌సైట్ ఏర్పాటుతోపాటు.. ఉపాధ్యాయులకు ప్రత్యేక ధ్రువీకరణను అందించనున్నారుఈ ఫలితాల ఆధారంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించినిరంతరాయంగా కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తారు.

మంత్రిత్వశాఖ ఇప్పటికే అమలు చేస్తున్న అటల్ వయో అభ్యుదయ యోజన, ‘ఎల్డర్‌లైన్’ హెల్ప్‌లైన్ వంటి వయోవృద్ధుల సంక్షేమ పథకాలకు.. ఈ కార్యక్రమం అదనపు బలాన్ని చేకూరుస్తుందివయోవృద్ధులు తమ అనుభవాలనూజీవన విలువలనూ తర్వాతి తరానికి అందించడానికి మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుందిఅలాగే తల్లిదండ్రులు సంప్రదాయానికీ ఆధునికతకూ మధ్య వారధిలా నిలిచేందుకుపిల్లలు సాంస్కృతిక మూలాలను విస్మరించకుండా మానసిక ధైర్యంతో వికసించేందుకు ఇదెంతగానో తోడ్పడుతుంది.

శ్రీ రామకృష్ణ పరమహంసస్వామి వివేకానంద దివ్య బోధనల స్ఫూర్తితో ఆవిర్భవించిన రామకృష్ణ మఠంరామకృష్ణ మిషన్లకు.. విద్యవైద్యంసంస్కృతిమానవతా సేవా రంగాల్లో శతాబ్దానికి పైగా విశేష అనుభవం ఉందిఈ సరికొత్త కార్యక్రమానికి రామకృష్ణ మిషన్ నిర్వహణ భాగస్వామిగా వ్యవహరిస్తుందిఅలాగే దీనికి సంబంధించి పరిశోధనరూపకల్పనమూల్యాంకనం వంటి బాధ్యతల కోసం ఒక విజ్ఞానాభివృద్ధి భాగస్వామ్య సంస్థ సహకారాన్ని అందించనుంది

***


(రిలీజ్ ఐడి: 2305277) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada