రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నిపుణ్

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 4:43PM by PIB Hyderabad

నిస్టార్ శ్రేణికి చెందిన రెండో డైవింగ్ సహాయక నౌక ఐఎన్ఎస్ నిపుణ్‌ను భారత నౌకాదళం ప్రారంభించింది. 2026 ఆగస్టు 31న ముంబయిలోని నౌకాదళ ఓడరేవులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుసముద్ర మధ్యంలో డైవింగ్జలాంతర్గత కార్యకలాపాలుజలాంతర్గాముల రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఇదొక కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు.

 

నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అధ్యక్షతన.. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారునౌకాదళ సీనియర్ అధికారులువిశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్ప్రతినిధులుపూర్వ సైనికోద్యోగులుపలువురు ప్రముఖులతోపాటు నౌకాదళ సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. దేశీయ పరిజ్ఞానంతో ఈ నౌకను రూపకల్పన చేసినిర్మించింది. ‘ఐఎన్ఎస్ నిపుణ్’ చేరిక.. భారత నౌకాదళ ప్రత్యేక జలాంతర్గత సామర్థ్యానికి మరింత బలాన్ని చేకూర్చిందిసాంకేతికంగా సంక్లిష్టమైన ప్రత్యేక నౌకలను తయారుచేసే స్థాయికి భారత్ చేరుకున్నదనేందుకు ఇది నిదర్శనంఅంతేకాకుండా రక్షణ రంగానికి చెందిన నౌకా నిర్మాణంలో ఆత్మనిర్భరత దిశగా ఇది మరో కీలక ముందడుగునౌకాదళ దేశీయ సామర్థ్యాలను పటిష్టం చేసుకోవడంలో దేశంలోని ఓడరేవులురక్షణ రంగ పరిశ్రమలుఅనుబంధ సంస్థల పాత్రను కూడా ఇది వెల్లడిస్తోంది.

 

సముద్ర అగాధాల్లో డైవింగ్జలాంతర్గత కార్యకలాపాల కోసం ఐఎన్ఎస్ నిపుణ్ నౌకను ప్రత్యేకంగా రూపొందించారుశాచ్యురేషన్ఎయిర్హీలియాక్స్ తరహా డైవింగ్‌ సామర్థ్యం ఈ నౌక సొంతంనీటి లోపల పరిశీలనలుసహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా ఇందులో రిమోట్‌తో పనిచేసే అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారుప్రత్యేక డైవింగ్ కాంప్లెక్సుగతిశీల స్థాన నిర్ణయ సామర్థ్యంతోపాటు.. అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతోసముద్రంలో దీర్ఘకాలం పాటు సంక్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించడానికి సాధ్యపడుతుంది.

 

జలాంతర్గాముల రక్షణ చర్యలను చేపట్టే సామర్థ్యం కూడా ఐఎన్ఎస్ నిపుణ్‌కు ఉందిసముద్ర గర్భంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది భారత నౌకాదళానికి ఎంతో దోహదపడుతుందిఇప్పటికే సేవలందిస్తున్న తోటి నౌక ఐఎన్ఎస్ నిస్టార్‌తో కలిపి చూస్తే.. డైవింగ్జలాంతర్గత కార్యకలాపాలుసముద్రపు అడుగున చిక్కుకున్న వస్తువులను వెలికితీసే చర్యలుజలాంతర్గాముల రక్షణ రంగాల్లో నౌకాదళ ప్రత్యేక సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

 

నౌక ప్రత్యేక పాత్రను, సముద్ర గర్భంలోకి వెళ్లే నావికుల సాహస పటిమను చాటేలా ఈ నౌకపై చిహ్నంసూక్తి ఉన్నాయి. ‘అగాధాల్లోనూ అందరికన్నా ముందే (ఫార్ బినీత్ఫ్యూ బియాండ్)’ అన్న ఈ వాక్యం.. అత్యంత సవాలుతో కూడిన సముద్రపు లోతుల్లో ఆపరేషన్లు నిర్వహించేందుకు కావలసిన పట్టుదలనైపుణ్యంసహనానికి నిదర్శనంగా నిలుస్తుంది.

 

ఈ సందర్భంగా నౌకాదళ ప్రధానాధికారి (సీఎన్ఎస్మాట్లాడుతూ.. భారత నౌకాదళంహిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్దేశీయ పారిశ్రామిక రంగాలు కలసికట్టుగా సాధించిన విజయానికి ఐఎన్ఎస్ నిపుణ్‌ నిదర్శనమన్నారుఒకే విడత సముద్ర పరీక్షల్లో అన్ని డైవింగ్ వ్యవస్థల సామర్థ్యాన్ని నిరూపించడం.. దేశ సాంకేతిక ఆత్మవిశ్వాసానికీఇంజినీరింగ్ నైపుణ్యానికీ నిదర్శనమన్నారు.

 

వివాదాస్పద సముద్ర వాతావరణం పెరుగుతుండడం, ప్రపంచ సముద్ర మార్గాలకు పొంచి ఉన్న ముప్పుల నేపథ్యంలో.. పోరాట సంసిద్ధత భారత నౌకాదళానికి అత్యంత ప్రాధాన్య అంశంగా ఉందని సీఎన్ఎస్ స్పష్టం చేశారుపశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలోని పశ్చిమ తీరప్రాంతంలో సేవలందించే ఐఎన్ఎస్ నిపుణ్.. వివిధ రకాల జలాంతర్గత కార్యకలాపాలకు కావాల్సిన ప్రత్యేక సామర్థ్యాలను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

 

ప్రపంచంలో కొద్ది దేశాల నౌకాదళాల వద్ద మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక సామర్థ్యాలు.. ఐఎన్ఎస్ నిపుణ సొంతమని సీఎన్ఎస్ పునరుద్ఘాటించారుప్రమాదంలో చిక్కుకున్న మన జలాంతర్గాములతోపాటు.. మిత్రదేశాల జలాంతర్గాముల విషయంలో కూడా తక్షణ సహాయక చర్యలకు ఇదెంతగానో ఉపయోగపడుతుందన్నారుదీంతో భారత్ ఈ ప్రాంతంలో విశ్వసనీయ జలాంతర్గామి రక్షణ భాగస్వామిగా ఎదుగుతుందని తెలిపారుఅంతేకాకుండా మునిగిన నౌకల నుంచి వస్తువులను బయటకు తీయడం (సాల్వేజ్), మానవతా సాయంవిపత్తు సహాయక (హెచ్‌ఎడీఆర్చర్యలను చేపట్టడంలో కూడా ఇది ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.

 

నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి సీఎన్‌ఎస్ మాట్లాడుతూ.. వారు ఒక అత్యాధునిక నౌక బాధ్యతలను స్వీకరించడమే కాకుండాఆ ఉక్కుకు ఊపిరి పోసిదానికొక శక్తిమంతమైన రూపాన్నిచ్చే గురుతర బాధ్యతను నిర్వర్తించారన్నారు. ‘నిశ్చయ్నిర్భయ్నిపుణ్’ అనే ఈ నౌక ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవాలని వారిని కోరారుఅలాగే విధి నిర్వహణగౌరవంధైర్యం అనే నౌకాదళ మౌలిక విలువలకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆరంభ పతాకావిష్కరణతో.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నిపుణ్ అధికారికంగా ప్రవేశించిందిసముద్రపు అలల అడుగున విధులు నిర్వర్తించే నౌకాదళ సిబ్బందికి తోడ్పాటునందిస్తూ.. దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు సిద్ధంగా ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2305257) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam