ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్తాన్‌ యువత ఉత్సాహం పట్ల ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2026 5:46PM by PIB Hyderabad

ఉజ్బెకిస్తాన్‌లో తన పర్యటనకు ముందు ఆ దేశ యువ మిత్రులు చూపిన ఉత్సాహం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వారి ఉత్సాహాన్ని తెలియజేస్తున్న ఒక వీడియోను పంచుకుంటూ, వారు హిందీలో ఇంత అందంగా మాట్లాడుతుంటే చూడటం హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

నేను నా ఉజ్బెకిస్తాన్ పర్యటనను ప్రారంభించబోతున్న తరుణంలో, ఈ వీడియోలో అద్భుతంగా వ్యక్తమైన ఉజ్బెకిస్తాన్‌ యువ మిత్రుల ఉత్సాహాన్ని చూడటం చాలా సంతోషం కలిగించింది.

దీన్ని మరింత ప్రత్యేకంగా చేసే విషయం ఏమిటంటే, వారు దీన్ని హిందీలో, అదీ చాలా చక్కగా మాట్లాడుతూ రూపొందించారు!

 

***


(రిలీజ్ ఐడి: 2304559) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil