జల శక్తి మంత్రిత్వ శాఖ
జేజేఎం 2.0 కింద స్థానిక విద్యాసంస్థల విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు డీడీడబ్ల్యూఎస్ సూచన
గ్రామీణ మంచి నీటి సరఫరాలో అభ్యాస బలోపేతానికి, ఆవిష్కరణల ప్రోత్సాహానికి, ప్రభావవంతమైన కార్యక్రమాల విస్తృత ప్రచారానికి ప్రత్యేక చొరవ
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 5:27PM by PIB Hyderabad
క్షేత్రస్థాయి అభ్యాసం, జ్ఞాన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా జల శక్తి మంత్రిత్వశాఖలోని తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను ప్రోత్సహించి జల జీవన్ మిషన్ (జేజేఎం) 2.0 కింద అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని నమోదు చేసి ప్రచురించాలని కోరింది.
జల జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి గ్రామీణ తాగునీటి రంగంలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమంగా నిలిచింది. దీని ఫలితంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమాజ భాగస్వామ్యం, నీటి వనరుల సుస్థిరత, నీటి నాణ్యత నిర్వహణ, నిర్వహణ–పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వికేంద్రీకృత పాలన వంటి రంగాల్లో అనేక ఆదర్శవంతమైన విధానాలు వెలుగులోకి వచ్చాయి.
క్షేత్రస్థాయి నూతన విధానాల విశిష్టతను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కింది చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించారు.
1. స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను భాగస్వామ్యం చేసి జేజేఎం 2.0 కింద ఎంపిక చేసిన కేస్ స్టడీలు, ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి నమోదు చేయాలని సూచించారు.
2. ఈ అధ్యయనాల ఫలితాలను విద్యా జర్నళ్లు, సంస్థాగత నివేదికలు, న్యూస్‌లెటర్లు, పరిశోధనా పత్రాలు, వెబ్‌సైట్లు తదితర వేదికల ద్వారా ప్రచురించాలని కోరారు. తద్వారా ఆధారాలతో కూడిన జ్ఞాన భాగస్వామ్యం, విజయవంతమైన విధానాల పునరావృతికి అవకాశం కలుగుతుందని తెలిపారు.
3. తగిన కేస్ స్టడీలు, సందర్శన ప్రదేశాలను గుర్తించి, స్థానిక విద్యాసంస్థలు, పాఠశాలలు, జిల్లా నీరు–పారిశుధ్య మిషన్లు (డీడబ్ల్యూఎస్‌ఎంలు), గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
4. సమీప పాఠశాలలకు చెందిన ఉన్నత పాఠశాల, సీనియర్ మాధ్యమిక విద్యార్థుల కోసం బహుళ గ్రామాల నీటి సరఫరా పథకాలు (ఎంవీఎస్), నీటి శుద్ధి కేంద్రాలు (డబ్ల్యూటీపీలు), నీటిని తీసుకునే బావులు,సూపర్‌వైజరీ కంట్రోల్, డేటా అక్విజిషన్ (ఎస్‌సీఏడీఏ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్, కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు పొందిన నీటి పరీక్షా ప్రయోగశాలలకు సందర్శనలు నిర్వహించాలని సూచించారు.
2026 సెప్టెంబర్ చివరి నాటికి ప్రతి జిల్లాలో స్థానిక విద్యాసంస్థల భాగస్వామ్యంతో కనీసం ఒక విద్యార్థుల సందర్శన, ఒక కేస్ స్టడీ లేదా ఉత్తమ విధానాన్ని ప్రచురించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జేజేఎం 2.0 క్షేత్రస్థాయి అనుభవాల నుంచి నేర్చుకునే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, గ్రామీణ నీటి సరఫరాలో విజయవంతమైన విధానాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది.
***
(రిలీజ్ ఐడి: 2304421)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7