ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నారాయణ్‌ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 1:22PM by PIB Hyderabad

   శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. పరస్పర గౌరవం, కరుణతో కూడిన సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, ప్రబోధకుడుగా శ్రీ నారాయణ గురును ఆయన అభివర్ణించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి!. మేరునగ సమానుడైన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, ప్రబోధకుడుగా పరస్పర గౌరవం, కరుణతో కూడిన సమాజ వికాసం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ప్రబోధాలు ఎంతోమందికి ఆత్మస్థైర్యాన్నిచ్చాయి. విద్య, అధ్యయనంపై ఆయన దృక్కోణం కూడా ఎంతో విశిష్టమైనదే” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2304268) సందర్శకుల సూచీ సంఖ్య : : 8