రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తొలి స్వదేశీ బహుళార్ధసాధక నౌక ‘సమర్థక్’ నావికా దళానికి అప్పగింత

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 7:35PM by PIB Hyderabad

   ట్టుపల్లిలోని లార్సెన్ అండ్‌ టూబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్‌టి) సంస్థ నిర్మించిన తొలి దేశీయ బహుళార్ధ సాధక నౌక (ఎంపీవీ) ‘సమర్థక్‌’ను ఇవాళ భారత నావికాదళానికి అప్పగించారు.

ఈ నౌకలో 75 శాతానికి పైగా పరికరాలు దేశీయంగానే రూపొందించినవి కాగా, దీన్నొక విభిన్న  ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించగల వేదికగా తయారు చేశారు. అలాగే, అవసరమైనప్పుడు సముద్ర నిఘా-గూఢచర్యం, తీరప్రాంత గస్తీ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలకు తోడ్పడే విధంగా ఈ నౌకను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

ఈ నౌకకు ‘సమర్థక్’ (అండగా నిలిచేవాడు) అని నామకరణం చేయడం ఎంతయినా సముచితం. బహుళ వ్యూహాత్మక లక్ష్యాలను విజయవంతంగా ఛేదించడంలో విశ్వసనీయ సాధనంగా నిలవాలనే ప్రధానోద్దేశాన్ని ఈ పేరు ప్రస్ఫుటం చేస్తుంది. అందుకు తగినట్టుగానే ‘సమర్థక్’ ఏదో ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం కాకుండా విస్తృత శ్రేణి కార్యకలాపాల నిర్వహించగలిగేలా అత్యాధునికంగా రూపొందింది. తద్వారా ‘బహుళోపయోగ నౌక’ భావనకు నిదర్శనంగా నిలుస్తోంది.

భారత నావికాదళం కోసం స్వదేశీ నౌకా నిర్మాణ ప్రస్థానంలో ‘సమర్థక్‌’ అప్పగింత ఓ కీలక మలుపు. స్వయంసమృద్ధ భారత్‌ దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది. స్వావలంబన గల రక్షణ పారిశ్రామిక వ్యవస్థ సాకారం కోసం భారత్‌ కృషికి ఈ నౌక ఒక నిదర్శనమనడంలో సందేహం లేదు.

 

***


(రిలీజ్ ఐడి: 2303987) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi