సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ‘పరిశ్రమ అదాలత్’ కేసుల పరిష్కారం విలువ రూ.8.29 కోట్లు


ఎమ్ఎస్ఈలకు నగదు లభ్యత… సజావుగా వ్యాపారం

సంప్రదింపులు… ఓడీఆర్ వల్ల చెల్లింపులు సుసాధ్యం… లభిస్తున్న భరోసా

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 10:31AM by PIB Hyderabad

రూ.8.29 కోట్ల విలువ గల చెల్లింపులు నిలిచిపోయిన 65 కేసులను ‘పరిశ్రమ అదాలత్’ విజయవంతంగా పరిష్కరించిందిసూక్ష్మచిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఈ)కు ెల్లింపు వివాదాలను దృష్టిలో పెట్టుకొని ‘పరిశ్రమ అదాలత్’ ను సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈమంత్రిత్వశాఖతో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలువాణిజ్య కమిషనరేట్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్‌లో తెలంగాణ వాణిజ్యపరిశ్రమ మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐకార్యాలయంలో నిర్వహించిన ఈ అదాలత్ కార్యక్రమంలో ఎమ్ఎస్ఈలుకొనుగోలుదారు సంస్థలుప్రభుత్వ రంగ సంస్థలుఎమ్ఎస్ఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లుఆల్టర్నేటివ్ డిస్‌ప్యూట్ రిడ్రెసల్ (ఏడీఆర్సంస్థలతో పాటు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖకుతెలంగాణ ప్రభుత్వానికీ చెందిన అధికారులు పాల్గొన్నారు.


ఏదైనా సూక్ష్మ లేదా చిన్న వాణిజ్య పరిశ్రమకు చెల్లింపులు ఆలస్యమైతే, దాని ప్రభావం బిల్లులకే పరిమితం కాకుండా, వేతనాలుముడిసరుకురుణాలపైనా ప్రభావం చూపుతుంది. కొత్త వాణిజ్య అవకాశాలపైనా ఉంటుందిసకాలంలోసరైన పద్ధతిలో వివాదాన్ని పరిష్కరించుకోవడం వల్ల వాణిజ్యాన్ని సాఫీగా కొనసాగించడానికీసడలిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికీవాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికీ ఎలా తోడ్పడగలదన్న అంశాన్ని ఈ ‘పరిశ్రమ అదాలత్’లో ప్రస్తావించారు.

చెల్లింపుల్లో జాప్యం వల్ల వాణిజ్య కార్యకలాపాలకు విఘాతంసమస్యల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివరించడం ఈ సమావేశంలో చెప్పుకోదగిన అంశంవివాద పరిష్కారాల ప్రభావం కొలిక్కి తెచ్చిన వ్యవహారాలకే పరిమితం కాకుండావాణిజ్య కార్యకలాపాల పురోగతిలో కూడా కనిపించినట్లు వారు వివరించిన అనుభవాలు సూచిస్తున్నాయి.

 

విజయ గాథలు: నిలిచిపోయిన చెల్లింపుల నుంచి వాణిజ్య కార్యకలాపాలు మళ్లీ జోరందుకోవడం వరకూ.
బకాయిల వసూలుతో తిరిగివచ్చిన విశ్వాసం: దీర్ఘకాలంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినాఒప్పందానికి సంబంధించిన వివాదాలు తలెత్తినా పరిశ్రమ పొదుపు మొత్తాలకుభరోసాకు పెద్ద కుదుపు ఎదురవుతుందని నీమస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి శ్రీమతి శాలిని అన్నారునిలిచిపోయిన చెల్లింపు వ్యవస్థ ద్వారా ఈ కంపెనీ పదకొండు కేసులకు గాను తొమ్మిది కేసులను పరిష్కరింకున్నది. బకాయిలు వసూలైతే సంస్థ వాణిజ్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించిముందుకు సాగవచ్చన్న నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని ఆమె అన్నారు.

 

 

వాణిజ్య సంబంధాలను పరిరక్షించే రాజీఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు జవాబు ఇవ్వని ఓ కొనుగోలుదారు వద్ద నుంచి బకాయి సొమ్ము వసూలు అవడంతో పాటు కౌన్సిల్ కలగజేసుకోవడం వల్ల వాణిజ్య సంబంధాలు కూడా తిరిగి ఏర్పడ్డాయని నాగార్జునా అగ్రో కెమికల్స్‌కు చెందిన శ్రీ ముకుంద్ మహేశ్వరి అన్నారు. ‘‘నగదు అందడం పరిశ్రమకు ప్రాణవాయువుతో సమానం’’ అని ఆయన వర్ణించారు.
రెండేళ్ల నిరీక్షణకు నెలల వ్యవధిలో పరిష్కారం: బకాయిల వసూలుకు రెండు సంవత్సరాలుగా ఎదురు చూసినట్లు శ్రీ సొల్యూషన్స్‌కు చెందిన శ్రీ ఆత్మకూరి నమ్మాళ్వార్ అన్నారువివాద పరిష్కార వ్యవస్థ సాయంతోతమ కంపెనీ నాలుగు కేసులను రెండు నెలల నుంచి నాలుగు నెలల లోపు పరిష్కరించుకొనిసుమారు రూ.30 లక్షలను వసూలు చేసుకొందని ఆయన వెల్లడించారు.
ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు అండగా సమ్మిళిత వివాద పరిష్కార వ్యవస్థ:

ఆలస్యం అయిన చెల్లింపుల విషయంలో…

వాణిజ్య కార్యకలాపాల దిశగా కదలికకు బాటను వేసిన ఓడీఆర్: తొమ్మిది కొనుగోలుదారు సంస్థలతో హైదరాబాద్ అమోనియా అండ్ కెమికల్స్ సంస్థ దాదాపు రూ.79 లక్షలు మేరకు జాప్యం జరిగిందిదీంతో సంస్థ నగదు పరంగా ఇబ్బందులను ఎదుర్కొందిఓడీఆర్ వేదిక ద్వారా సంబంధిత పక్షాలతో మూడు రాజీ సమావేశాలు జరిగాయిఒక ప్రధాన కొనుగోలుదారు సంస్థ రూ.20 లక్షలు ఇవ్వగాఇతర కొనుగోలుదారు సంస్థలు కూడా వాటి బకాయిలను చెల్లించిందిమొత్తం రూ.54 లక్షలు రాబట్టుకొన్నట్లు ఈ కంపెనీ తెలిపింది.


ప్రతి కేసు వెనుకా ఓ వ్యక్తి చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా తమ కంపెనీ రుణ ప్రొఫైల్‌పై ఎలాంటి ప్రభావం పడిందీ శబరి ఇండస్ట్రీస్ కు చెందిన శ్రీ గోపీ కృష్ణ వివరించారుఈ వ్యవస్థ సహాయంతోతమ కంపెనీకి రెండు వాయిదాల్లో సుమారు రూ.40 లక్షలు అందాయని ఆయన తెలిపారుఓడీఆర్‌తో మూడు కేసులు పరిష్కారమయ్యాయని ఎ.పిఇంజినీరింగుకు చెందిన శ్రీ రంజిత్ రెడ్డి తెలిపారుసుమారు రూ.16 లక్షల కేసులో... చెల్లింపు చాలా కాలంగా ఆలస్యమైచివరకు ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయని పాండురంగ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన శ్రీ శ్రీనివాసులు వెల్లడించారు.
ఓడీఆర్.. సాంకేతికతనీసంస్థల్నీమానవ ప్రమేయాన్నీ ఒక చోటుకు తీసుకురావడం
ఆన్‌లైన్ డిస్‌ప్యూట్ రిడ్రెసల్ (ఓడీఆర్వేదికను 2025లో ప్రారంభించారుఇది వివాదాల పరిష్కార ప్రక్రియలోకి సాంకేతికతను ప్రవేశపెట్టిడిజిటల్ మాధ్యమంలో బాటను వేసిందిచెల్లింపుల్లో జాప్యం జరిగిన వ్యవహారాల్ని ముందుకు తీసుకుపోవడం దీని ద్వారా సాధ్యపడుతుందిఇక ఎమ్ఎస్ఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల విషయానికి వస్తేఅవి పోషించే సంస్థాగత భూమిక.. పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఉంటోంది.
ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించి ఓ ప్రాథమిక ప్రణాళికను ‘సమాధాన్’ వెబ్‌సైట్ మొదలు ఓడీఆర్ వేదిక వరకూ ఎలా అభివృద్ధిపరిచిందీ ఎమ్ఎస్ఎమ్ఈ శాఖలో ఆర్ఏఎమ్‌పీ డైరెక్టరు అంకిత పాండే వివరించారుతెలంగాణాలో ఓడీఆర్ విస్తారిత అనుబంధ వ్యవస్థ ద్వారా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయనీవాటిలో దాదాపు 85 కేసులను పరిష్కరించారనీ కార్యక్రమంలో ప్రస్తావించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

 


ఈ కార్యక్రమం తెలంగాణ అనుసరిస్తున్న విస్తృత ఎమ్ఎస్ఎమ్ఈ అజెండా లో ఓ భాగమని ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల కమిషనరు శ్రీ జెనిఖిల్ చక్రవర్తి తెలిపారువ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా సాంకేతికతసంస్థాగత పరిష్కారాలు దోహదపడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.


వివాద పరిష్కార వ్యవస్థ ఎన్ని కేసుల్ని కొలిక్కితీసుకొచ్చిందని కాకఎన్ని వాణిజ్య సంస్థలు ముందుకు పోవడానికి సాయపడిందనేదే ఆ వ్యవస్థ విజయానికి కొలబద్ద అవుతుందని ‘పరిశ్రమ అదాలత్’ స్పష్టం చేసిందిరాజీసంస్థాగత యంత్రాంగాలుడిజిటల్ సాధనాలు.. వీటిని ఒక చోటుకు చేర్చిఈ ‘పరిశ్రమ అదాలత్’ కార్యక్రమం ఔత్సాహిక పారిశ్రామికవేత్తకుచట్టబద్ధ క్లెయిముకుసంభావిత పరిష్కారానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2303079) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil