ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 24న ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2026 3:58PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఉన్న ముసునూరులో పర్యటిస్తారు.

తన పర్యటనలో భాగంగా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీలో జరిగే ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. భారత తొలి నాన్-జిఎంవో అధిక-విస్తరణ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. రైతులను సత్కరించి... వ్యవసాయ రంగ భాగస్వాములు, కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి  ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2302550) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam