భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

పోటీని దెబ్బతీసే చర్యలకు పాల్పడినందుకుగాను


ఆగ్రో ఇన్‌పుట్ డీలర్స్ అసోసియేషన్, ఆగ్రో ఇన్‌పుట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లపై ఆర్థిక, ఆర్థికేతర ఆంక్షలను విధించిన సీసీఐ

प्रविष्टि तिथि: 21 AUG 2026 6:42PM by PIB Hyderabad

సిండికేట్ గా ఏర్పడి పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆగ్రో ఇన్‌పుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఏఐడీఏ), ఆగ్రో ఇన్‌పుట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏఐడబ్ల్యూఏపైనామన్మోహన్‌ సికలంత్రిఅరవింద్‌భాయ్‌ జెరంభాయ్‌ పటేల్‌ పైనా పోటీ చట్టం - 2002లోని సెక్షన్‌ 27 కింద భారత పోటీ (కాంపిటీషన్)  కమిషన్‌ (సీసీఐ)  ఆర్థికఆర్ధికేతర ఆంక్షలు విధించింది.

ఈ వ్యవహారంలో ఏఐడీఏఏఐడబ్ల్యూఏ,  కలంత్రిపటేల్‌లు పోటీ చట్టంలోని సెక్షన్‌ 3(1)తో కలసి ఉన్న సెక్షన్‌ 3(3)(బినిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్‌ నిర్ధారించిందిఈ మేరకుచట్టంలోని సెక్షన్ 27(ప్రకారం చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలినందున సంస్థలువారి ప్రతినిధులు ఏఐడీఏ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రవీణ్ భాయ్ పటేల్ఏఐడీఏ జాతీయ ప్రతినిధి శ్రీ సంజయ్ కుమార్ రఘువంశీలను భవిష్యత్తులో ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని కమిషన్ ఆదేశించిందిచట్టంలోని సెక్షన్ 48 నిబంధనల కింద వీరిని బాధ్యులుగా నిర్ధారించింది

ఉల్లంఘన స్వభావంతీవ్రతనుఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఏఐడీఏపై రూ. 81,889, ఏఐడబ్ల్యూఏపై రూ. 3,92,269, కలాంత్రికి రూ. 4,98,903, అరవింద్ భాయ్ జేరాంభాయ్ పటేల్‌కి రూ. 74,717, ప్రవీణ్ భాయ్ పటేల్‌కి రూ. 9,177, రఘువంశీకి రూ. 8,622 చొప్పున జరిమానాలు విధించింది.

చట్టంలోని సెక్షన్‌ 27(జీప్రకారంపోటీ చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు తమ సంఘాల్లో పోటీ చట్టాల నిబంధనలను పాటించే సంస్కృతిని ప్రోత్సహించేందుకు సంబంధిత సంస్థలు పోటీ చట్టాల అనుసరణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిషన్‌ ఆదేశించింది.

కేసు నంబర్‌ 06/2023 లో జారీ చేసిన ఉత్తర్వు పబ్లిక్‌ వెర్షన్‌ ప్రతిని సీసీఐ  వెబ్‌సైట్‌ www.cci.gov.in లో అందుబాటులో ఉంచారు. 

 

***


(रिलीज़ आईडी: 2302234) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil