మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునర్వ్యవస్థీకృత జాతీయ మైనారిటీల కమిషన్ తొలి సమావేశం: మైనారిటీల సంక్షేమం-రక్షణ చర్యలపై సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 6:28PM by PIB Hyderabad

   జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సీఎం) పునర్వ్యవస్థీకృతమైన నేపథ్యంలో చైర్మన్ శ్రీ హర్జీత్ సింగ్ గ్రేవాల్ అధ్యక్షతన ఇవాళ తొలిసారి సమావేశమైంది.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి ఎస్.మునవరి బేగం, సభ్యులు శ్రీ బెర్జిస్ దేశాయ్, శ్రీ గ్లెన్ ఇ సౌజా టిక్లో కూడా పాల్గొన్నారు. అలాగే, ఎన్‌సీఎం కార్యదర్శి శ్రీ సుచీంద్ర మిశ్రా, సంయుక్త కార్యదర్శి డాక్టర్ అత్యానంద్‌ సహా కమిషన్ అధికారులు కూడా దీనికి హాజరయ్యారు.

మైనారిటీల సంక్షేమం, ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలను కమిషన్ ఈ సందర్భంగా సమీక్షించింది. దీంతోపాటు పరిశీలనార్థం నివేదించిన అనేక విషయాలపై చర్చించింది. మరోవైపు కమిషన్ కార్యకలాపాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు అపరిష్కృత అంశాలపై తదుపరి కార్యాచరణపైనా చర్చించారు.

మైనారిటీల ప్రగతికి కృషి, వారి ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన రక్షణ చర్యల అమలుపై పర్యవేక్షణ కమిషన్ ప్రధాన బాధ్యతలని చైర్మన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2301767) సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil