సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమైన సీనియర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరీ జోయెల్ సాండ్రిన్ వాలెరే నేతృత్వంలోని మారిషస్ సీనియర్ ప్రభుత్వోద్యోగుల ప్రతినిధి బృందం
నేషనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) నిర్వహించే సామర్థ్య నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతినిధి బృందం
సామర్థ్యాలను పెంపొందించే ప్రక్రియ... బాధ్యతల-ఆధారిత, నైపుణ్య-ఆధారితమైన నిరంతర అభ్యసన ప్రక్రియగా పరిణామం చెందాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
సీనియర్ ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా నిర్వహిస్తున్న 4వ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజా పరిపాలన రంగంలో భారత్-మారిషస్ పరస్పర సహకారం మరింత బలోపేతం
ప్రజా సేవ విధానాల అభ్యసనం, ఆవిష్కరణల్లో సంస్థాగత అనుసంధానాలను భారత్-మారిషస్‌లు బలోపేతం చేసుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
ఎన్‌సీజీజీ-మారిషస్ భాగస్వామ్యం కింద ఐదేళ్లలో 500 మంది మారిషస్ సీనియర్ ప్రభుత్వోద్యోగులకు శిక్షణ ఇవ్వనున్న భారత్
प्रविष्टि तिथि:
20 AUG 2026 3:07PM by PIB Hyderabad
సీనియర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరీ జోయెల్ సాండ్రిన్ వాలెరే నేతృత్వంలోని మారిషస్ సీనియర్ ప్రభుత్వోద్యోగుల ప్రతినిధి బృందం ఈ రోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమైంది. నేషనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న... ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఈ ప్రతినిధి బృందం పాల్గొంటున్నది.
వేగంగా మారుతున్న పాలనా విధానాల్లో ప్రభుత్వోద్యోగులు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా... సాంప్రదాయిక శిక్షణకు అతీతంగా బాధ్యతల-ఆధారితమైన, నైపుణ్య-ఆధారితమైన నిరంతర అభ్యసనం దిశగా సామర్థ్యాలను పెంపొందించే ఈ కార్యక్రమం ముందుకుసాగాలని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) నిర్వహించిన... మారిషస్ సీనియర్ ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాలను పెంపొందించే 4వ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీలో ఈ నెల 17 నుంచి 22 వరకు 'నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్' (ఎన్‌సీజీజీ) ఆధ్వర్యంలో, మారిషస్ ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా 4వ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజా పాలన, అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం వంటి రంగాల్లో భారత్-మారిషస్ దేశాలు ఈ కార్యక్రమం ద్వారా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. మారిషస్‌కు చెందిన 11 మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి 15 మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరిపాలనా పద్ధతులు, సంస్థాగత అనుభవాలు, ప్రజా సేవలను అందించడంలో అనుసరించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది.
మార్చి 2025లో మారిషస్ ప్రజా సేవ, పరిపాలనా సంస్కరణల మంత్రిత్వశాఖతో ఎన్‌సీజీజీ ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని కింద రాబోయే ఐదేళ్ల కాలంలో 500 మంది మారిషస్ ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా భారత్ ప్రత్యేక శిక్షణనివ్వనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మారిషస్‌లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 70 మంది ప్రభుత్వోద్యోగులు పాల్గొన్న గత మూడు కార్యక్రమాల తర్వాత... ప్రస్తుతం నాల్గో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది.
సామర్థ్యాలను పెంపొందించే ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం... సాంప్రదాయికమైన, ఒకేసారి ఇచ్చే శిక్షణకు అతీతంగా అభివృద్ధి చెందిన, బాధ్యతల-ఆధారితమైన, నైపుణ్యాల-ఆధారితమైన నిరంతర అభ్యసనంగా ముందుకుసాగాలని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సాంకేతికత, డేటా, కృత్రిమ మేధ, పౌరులకు సేవలందించడంలో కొత్త నమూనాలు వంటి వాటితో పాలన అభివృద్ధి చెందుతున్న క్రమంలో... ప్రభుత్వ ఉద్యోగులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రంగంలో తన అనుభవాన్ని పంచుకోవడానికి, మారిషస్ ప్రజా సేవా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దానిని అన్వయించగల మార్గాలను అన్వేషించేందుకు భారత్ సుముఖంగా ఉందనీ కేంద్ర మంత్రి తెలిపారు.
'అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్' ను భారత్-మారిషస్ దేశాల మధ్య కీలక సంస్థాగత వారధిగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. అధ్యాపక బృందం, శిక్షణా సామర్థ్యాల మెరుగుదల, ఉమ్మడి కార్యక్రమాల రూపకల్పన, సంస్థాగత అభివృద్ధి, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, కేస్ స్టడీలు, అవసరమైన రంగాల్లో ఉమ్మడి పరిశోధన వంటి అంశాల్లో... భారత్‌లోని ఎల్‌బీఎస్ఎన్ఏ, ఐఐపీఏ, ఐఎస్‌టీమ్ సంస్థలు, మారిషస్‌కు చెందిన ఏబీవీఐపీఎస్ఐ మధ్య బలమైన సంబంధాలు పెంపొందించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ సేవల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కారం, సాంకేతికత ఆధారిత పాలనలో భారత్ అనుభవాన్ని ప్రస్తావిస్తూ... పౌర కేంద్రిత పాలన, డిజిటల్ పరివర్తనలో సహకారానికి గల అవకాశాలను డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సాంకేతికతతో పాటు పరిపాలనా సంస్కరణలు, సంస్థాగత జవాబుదారీతనం గల సేవల పంపిణీ కోసం పౌర-కేంద్రిత విధానం కీలకమని ఆయన ఉద్ఘాటించారు.
కృత్రిమ మేధ, పరిపాలన, భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సీపీజీఆర్ఏఎమ్ఎస్, ఫిర్యాదుల పరిష్కారం, విద్య, సేవల పంపిణీలో డిజిటల్ పరివర్తన, పింఛను సంస్కరణలు, ఆధార్, పెట్టుబడులను ప్రోత్సాహించడం, ఎంఎస్ఎంఈలకు వ్యాపార సౌలభ్యం, వ్యవస్థాపనకు ప్రోత్సాహం, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ స్థానిక సంస్థలు సహా పలు సమకాలీన పరిపాలనా అంశాలు కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఐటీటీలోని స్టార్టప్ ఇండియా, ఐఐటీ ఢిల్లీ, ప్రధానమంత్రి సంగ్రహాలయ, ప్రైడ్, పీఎం గతి శక్తి, భారత ఎన్నికల సంఘం వంటి సంస్థలను, కార్యక్రమాలనూ మారిషస్ ప్రతినిధి బృందం స్వయంగా పరిశీలిస్తుంది.
ఒకరి పాలనా అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతనూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమం కేవలం అధికారులను శిక్షణకు పంపడానికే పరిమితం కాకూడదనీ... మరో ప్రభుత్వ యంత్రాంగం సవాళ్లను ఎలా ఎదుర్కొంటోంది, ఏ విధానాలు పాలనలో చక్కగా పనిచేస్తాయి, ఏ పాఠాలను విభిన్న సందర్భాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు అనే విషయాలను అర్థం చేసుకోవడానికీ ఇది దోహదపడాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పరిపాలన అనుభవాలను నమోదు చేసి, వాటిని ప్రభుత్వోద్యోగులకు ఆచరణాత్మక అభ్యసనంగా మార్చే కార్యక్రమంగా 'అమృత్ జ్ఞాన్ కోశ్'ను ఆయన అభివర్ణించారు.
సముద్రతీర దేశాలుగా భారత్-మారిషస్‌ల కోసం బ్లూ ఎకానమీ, సముద్ర సాంకేతికతలు, మత్స్య పరిశ్రమ, ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ, సుస్థిర అభివృద్ధి పరస్పర ప్రయోజనకరమైన రంగాలని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తించారు. ప్రత్యేక కార్యక్రమాలు, నైపుణ్యాలను పంచుకోవడం, ఉమ్మడి అభ్యసన కార్యక్రమాల ద్వారా... సామర్థ్యాలను పెంపొందించడంలో సహకారాన్ని ఈ అభివృద్ధి చెందుతున్న రంగాలతో అనుసంధానించవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సహకారంలోని తదుపరి దశ... వ్యక్తిగత కార్యక్రమాల నుంచి రెండు ప్రభుత్వ సేవల మధ్య మరింత నిర్మాణాత్మకమైన, శాశ్వత భాగస్వామ్యం దిశగా సాగాలని కేంద్ర మంత్రి అన్నారు. ఏబీవీఐపీఎస్ఐ, భారతీయ శిక్షణ సంస్థల మధ్య సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయాలనీ, ఐజీవోటీ కర్మయోగి భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేయాలనీ, మారిషస్ ప్రభుత్వోద్యోగుల కోసం ప్రత్యేకంగా సంబంధిత అభ్యసన వనరులను సృష్టించాలనీ డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.
సామర్థ్యాలను పెంపొందించే విషయంలో భారత్-మారిషస్ సహకార విస్తృత పరిధినీ ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. 'ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (ఐటీఈసీ) కార్యక్రమం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందుతున్న దేశాల్లో మారిషస్ ఒకటి. దీని కింద ఆ దేశానికి ప్రతియేటా సుమారు 500 మందికి శిక్షణ అవకాశాలు లభిస్తుండగా... 2007 నుంచి ఇప్పటివరకు పౌర, రక్షణ విభాగాల కింద దాదాపు 5,600 మంది మారిషస్ పౌరులు శిక్షణ పొందారు.
మారిషస్ ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగుల ప్రతినిధి బృందంలో... ఆ దేశ విద్య, మానవ వనరుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి శ్రీ దూనుంజయ్ దాసే... స్థానిక ప్రభుత్వ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి శ్రీమతి ఫూల్‌రైనీ రాంపాదరత్... కేబినెట్ కార్యాలయ సీనియర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి మేరీ జోయెల్ సాండ్రిన్ వాలెరే... సమాచార సాంకేతిక, ప్రసార, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి శ్రీ ఫెర్హాన్ ఖాన్ జుహూర్... పరిశ్రమలు, ఎస్ఎంఈ, సహకార సంస్థల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి శ్రీమతి ఇందిరా పాదరుత్ రుచయ్యా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
***
(रिलीज़ आईडी: 2301765)
आगंतुक पटल : 7