ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్సాహం, దృఢత్వాల ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 AUG 2026 10:40AM by PIB Hyderabad
కఠిన సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా బుద్ధిమంతులు, దృఢనిశ్చయులు తమ ఉత్సాహాన్ని కోల్పోరని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ఒక సందేశంలో ‘‘ఆపత్కాలే చ కష్టేఅపి నోత్సాహస్యజ్యతే బుధైః, ఇతి ప్రబోధితస్తేన కథన్చిద్ దృఢబుద్ధినా’’ అన్న సంస్కృత సుభాషితాన్ని గురించి వివరించారు.
కఠిన సమయాలు, సవాళ్లతో నిండిన పరిస్థితుల్లో కూడా స్థిర మనస్కులు, దృఢ మనస్కులు అయిన బుద్ధిమంతులు తమ ఉత్సాహాన్ని ఎప్పటికీ కోల్పోమనే స్పృహను కలిగి ఉంటారనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఆపత్కాలే చ కష్టేఅపి నోత్సాహస్యజ్యతే బుధైః
ఇతి ప్రబోధితస్తేన కథన్చిద్ దృఢబుద్ధినా’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2301467)
आगंतुक पटल : 5