ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 17 AUG 2026 12:08PM by PIB Hyderabad

బీహార్‌లోని లఖిసరాయ్‌లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ విషాద సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’


 

***

MJPS/SS/PRK


(రిలీజ్ ఐడి: 2300344) సందర్శకుల సూచీ సంఖ్య : : 58