గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల 8వ విడత వేలంపై రోడ్‌షోను,


ఎన్ఎంఈడీటీ వర్క్‌షాప్‌ను పాట్నాలో నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 16 AUG 2026 4:19PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకుల 8వ విడత వేలంపై రోడ్‌షోనూజాతీయ ఖనిజ అన్వేషణఅభివృద్ధి ట్రస్ట్ (ఎన్ఎంఈడిటీ)పై వర్క్‌షాప్‌నూ 2026 ఆగస్టు 17న బీహార్‌లోని పాట్నాలో నిర్వహించనున్నారు.

బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్‌ చంద్ర దూబే అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్‌ చౌధరిబిహార్ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ పాల్గొంటారుబీహార్ గనుల శాఖభారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్)కు చెందిన ఉన్నతాధికారులతో పాటు పరిశ్రమ ప్రతినిధులుపెట్టుబడిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు

ఈ 8వ విడత వేలంలో గ్రాఫైట్రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ), అరుదైన లోహాలువెనాడియంగాలియంటైటానియంమోలిబ్డినంటంగ్‌స్టన్పొటాష్ఫాస్ఫోరైట్గ్లాకోనైట్ వంటి వివిధ రకాల కీలకవ్యూహాత్మక ఖనిజాలకు చెందిన 20 బ్లాకులు ఉన్నాయివీటిలో మైనింగ్ లీజ్ (ఎంఎల్), 17 కాంపోజిట్ లైసెన్స్ (సీఎల్బ్లాకులు ఉన్నాయి.

 

రోడ్‌షో ద్వారా వేలానికి అందుబాటులో ఉన్న ఖనిజ బ్లాకుల సామర్థ్యంవేలం విధానంబిడ్డింగ్ ప్రక్రియకీలకవ్యూహాత్మక ఖనిజాల రంగంలో పెట్టుబడులుభాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై ఔత్సాహిక పెట్టుబడిదారులుపరిశ్రమ వర్గాలకు సమగ్ర అవగాహన కల్పించనున్నారుఖనిజ బ్లాకులపై ఎంఈసీఎల్ఖనిజాల వేలం ప్రక్రియటెండర్ పత్రంపై ఎస్ బీఐసీఏపీఎస్-వేలం ప్రక్రియపై ఎంఎస్టీసీ సంస్థలు సమగ్ర ప్రజెంటేషన్లు ఇవ్వనున్నాయిఎన్ఎంఈడీటీఈ కార్యక్రమంలో కాంపోజిట్ లైసెన్స్‌దారులు చేసిన ఖనిజ అన్వేషణ వ్యయాల్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించే ఎన్ఎంఈడీటీ పథకంపై కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారుఅనంతరం భాగస్వామ్య వర్గాల మధ్య పరస్పర చర్చకువేలం ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఓపెన్‌ హౌస్‌  నిర్వహించనున్నారు.

కార్యక్రమం రెండో భాగంలో ఖనిజ అన్వేషణప్రణాళికఅమలునివేదికల తయారీ అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారుభారత్‌లో ఖనిజ అన్వేషణకు ఉన్న అవకాశాలుజాతీయ భూవిజ్ఞాన డేటా రిపాజిటరీ (ఎన్జీడీఆర్)ని ఉపయోగించి అన్వేషణ బ్లాకుల రూపకల్పనఖనిజ అన్వేషణ నివేదికల తయారీ వంటి అంశాలను వివరించనున్నారుభారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐఉన్నతాధికారులు సాంకేతిక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.

ఖనిజ అన్వేషణను ప్రోత్సహించడంకీలకవ్యూహాత్మక ఖనిజ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడంప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడందేశ ఖనిజ భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న కృషిని ఈ కార్యక్రమం తెలియచేస్తుందిఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుస్వచ్ఛ ఇంధనంఇతర వ్యూహాత్మక రంగాలకు అవసరమైన ఖనిజాల దేశీయ అన్వేషణఅభివృద్ధిని మరింత విస్తరించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

 

****


(रिलीज़ आईडी: 2300304) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil