రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్‌ భారత్‌: భారత సైన్యం కోసం రూ.1,577 కోట్లతో లాయిటర్‌ మ్యూనిషన్‌ సిస్టమ్స్‌ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2026 7:33PM by PIB Hyderabad

భారత సైన్యం కోసం లాయిటర్‌ మ్యూనిషన్‌ సిస్టమ్స్‌తో పాటు వాటికి సంబంధించిన మ్యూనిషన్స్‌, ఇతర ఉపకరణాల కొనుగోలుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, నిబే ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. సుమారు రూ.1,577 కోట్ల విలువైన ఈ ఒప్పందాలపై ఈ రోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ కుమార్‌ సింగ్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి.

 

లోయిటర్ మ్యునిషన్ సిస్టమ్ ఆర్టిలరీ రెజిమెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి,  తద్వారా భారత ఆర్మీ మొత్తం నిర్వహణ సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి అభివృద్ధి చేసిన కీలకమైన పరికరం.  ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా 'బై (ఇండియన్)' కేటగిరీ కింద సేకరిస్తున్న ఈ కొనుగోలు, భారతీయ పరిశ్రమల తయారీ సామర్థ్యాలను మరింత పెంచుతుంది.

ఈ సేకరణ భారతీయ రక్షణ పరిశ్రమలను ఆధునీకరించడానికీ, సాధికారత కల్పించడానికీ ఒక కీలకమైన అడుగు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' ఆశయాలకు గర్వకారణమైన ప్రతీకగా నిలుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2299645) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi