ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారత్‌లో సెమీకండక్టర్ డిజైన్ వ్యవస్థను, పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేస్తోన్న ‘చిప్స్ టు స్టార్టప్స్’ కార్యక్రమం
సీ2ఎస్ కార్యక్రమం ద్వారా 68, 000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ.. విజయవంతంగా 254 చిప్ డిజైన్ల రూపకల్పన
प्रविष्टि तिथि:
14 AUG 2026 1:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశాన్ని సెమీకండక్టర్ చిప్ రూపకల్పనలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. ఈ దిశగా సెమీకండక్టర్ విద్య, పరిశోధన, డిజైన్ మౌలిక సదుపాయాల రంగంలో వ్యూహాత్మక విధానాలు, నిరంతర పెట్టుబడుల ద్వారా దేశీయంగా శక్తిమంతమైన డిజైన్ వ్యవస్థను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను నిరంతరం బలోపేతం చేస్తోంది.
దేశవ్యాప్తంగా సామర్థ్య పెంపుదలతో పాటు సెమీకండక్టర్ డిజైన్ రంగంలో ఎదురవుతున్న మౌలిక సదుపాయాల సమస్యతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను అధిగమించడానికి ‘చిప్స్ టు స్టార్టప్స్’ (సీ2ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ స్థాయిల్లో సెమీకండక్టర్ చిప్ డిజైన్ విభాగంలో ప్రత్యేక శిక్షణ అందిస్తూ, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా 85,000 మంది నిపుణులను తయారు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
సీ2ఎస్ కార్యక్రమం ద్వారా:
1. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 68,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించారు.
2. దేశవ్యాప్తంగా 332 విద్యా సంస్థలకు సినాప్సిస్, కేడెన్స్, సీమెన్స్ ఈడీఏ, యాన్సిస్, కీసైట్, సిల్వాకో, రెనెసాస్-ఆల్టియం, ఏఎండీ-గ్జిలిన్క్స్, ఆస్టర్ క్వాంటా, కంప్‌కార్టా, కాడర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన అధునాతన ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) వంటి సాంకేతిక సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
3. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాసంస్థలు ఇప్పటివరకు 254 చిప్ డిజైన్లను విజయవంతంగా తయారీకి సిద్ధం చేశాయి. వీటిలో 175 డిజైన్లు మొహాలీలోని ఎస్‌సీఎల్ 180 ఎన్ఎం సాంకేతిక నోడ్‌పై, మరో 79 డిజైన్లు విదేశాల్లోని సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రంలో రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో:
1. చిప్స్ టు స్టార్టప్స్ కార్యక్రమం ద్వారా 23 విద్యాసంస్థలకు అత్యాధునిక ఈడీఏ సాధనాలను వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ఈ సాధనాలను మొత్తం 4.34 లక్షల గంటలకు పైగా ఉపయోగించారు. ఆ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.
Sr No
|
Name of Institution
|
1
|
Indian Institute of Technology Tirupati
|
2
|
Indian Institute of Information Technology Design and Manufacturing Kurnool
|
3
|
National Institute of Technology Andhra Pradesh
|
4
|
Shri Vishnu Engineering College for Women, Bhimavaram
|
5
|
Vignan's Foundation for Science Technology and Research, Guntur
|
6
|
Vellore Institute of Technology (VIT-AP) University, Amaravati, AP
|
7
|
SRM University, AP
|
8
|
Jawaharlal Nehru Technological University (JNTU), Kakinada
|
9
|
Jawaharlal Nehru Technological University (JNTU), Anantapur
|
10
|
V.R. Siddhartha Engineering College, Vijayawada
|
11
|
Anil Neerukonda Institute of Technology & Sciences (ANITS), Visakhapatnam
|
12
|
Vishnu Institute of Technology, AP
|
13
|
Sagi Rama Krishnam Raju (SRKR) Engineering College, Andhra Pradesh
|
14
|
GMR Institute of Technology (GMRIT), Andhra Pradesh
|
15
|
G. Pullaiah College of Engineering and Technology, Kurnool
|
16
|
Koneru Lakshmaiah Education Foundation, Guntur
|
17
|
Vignan's Institute of Information Technology, Visakhapatnam
|
18
|
Mohan Babu University, Tirupati, Andhra Pradesh
|
19
|
Narayana Engineering College, Gudur, Andhra Pradesh
|
20
|
Sri Vasavi Engineering College, Tadepalligudem, Andhra Pradesh
|
21
|
Gayatri Vidya Parishad College of Engineering, Visakhapatnam
|
22
|
Santhiram Engineering College, Nandyal, Kurnool
|
23
|
National Institute of Electronics and Information Technology Tirupati
|
2. నాలుగు విద్యాసంస్థల్లో సెమీకండక్టర్ చిప్ డిజైన్ పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు సామర్థ్యాలను పెంపొందించేందుకు కింద పేర్కొన్న పరిశోధనా ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించారు.
ఎ. క్రిప్టోగ్రాఫిక్ అనువర్తనాల కోసం సురక్షితమైన ఆర్ఐఎస్‌సీ-వీ ప్రాసెసర్ అభివృద్ధి- ఐఐటీ తిరుపతి.
బి. హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌లో కంప్యూటింగ్ పనితీరును మెరుగుపరిచేందుకు హార్డ్‌వేర్ యాక్సిలరేటర్ అభివృద్ధి- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) కర్నూలు.
సి. ఎడ్జ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అనువర్తనాల కోసం శక్తి సామర్థ్యం కలిగిన న్యూరోమార్ఫిక్ ప్రాసెసర్ అభివృద్ధి- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఆంధ్రప్రదేశ్.
డి. ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) అనువర్తనాల కోసం మెమరీని సమర్థవంతంగా వినియోగించే కో ప్రాసెసింగ్ యూనిట్ అభివృద్ధి- శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం.
ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం డిజైన్, అభివృద్ధి దశల్లో వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ప్రాజెక్టుల పరిధి, అభివృద్ధి స్థాయిని బట్టి, అవసరమైన చోట సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కేంద్రాల్లో ప్రోటోటైప్ ధ్రువీకరణ దిశగా ముందుకు సాగుతాయని భావిస్తున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద లోక్‌సభలో 12.08.2026న అందించారు.
***
(रिलीज़ आईडी: 2299466)
आगंतुक पटल : 8