రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పోర్చుగల్‌లోని పోంటా డెల్గాడాలోకి ప్రవేశించిన లోకయాన్-2026 భారత నౌకాదళ నౌక సుదర్శిని

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2026 2:37PM by PIB Hyderabad

లోకాయన్-2026 యాత్రలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని ఆగస్టు 13, 2026న పోర్చుగల్‌లోని అజోర్స్‌లో పోంటా డెల్గాడా ఓడరేవుకు చేరుకుంది. అమెరికాలోని బోస్టన్ నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ సాగిన 19 రోజుల సుదీర్ఘ సముద్ర ప్రయాణం విజయవంతంగా ముగిసింది. ఐఎన్ఎస్ సుదర్శిని అట్లాంటిక్ సముద్రాన్ని దాటటం ఇది రెండోసారి. నౌకాదళ సిబ్బంది సహనం, పట్టుదల, నావికా నైపుణ్యాలను ఈ యాత్ర చాటిచెబుతుంది.

పోర్చుగీసు నావికాదళం నుంచి ఈ నౌకకు ఘన స్వాగతం లభించింది. భారతదేశ సుసంపన్న సముద్రయాన వారసత్వాన్ని, మైత్రిని, సముద్ర సహకార సందేశాన్ని ఈ పోర్టు సందర్శన తెలియజేస్తుంది. ఈ సందర్శన సందర్భంగా అజోర్స్ మారిటైమ్ జోన్ కమాండర్ (సీఓఎం సీజడ్ఎంఏ) కొమోడోరో లూయిస్ నికల్సన్ లావ్రాడోర్‌ను ఐఎన్ఎస్ సుదర్శిని కమాండింగ్ ఆఫీసర్ మర్యాదపూర్వకంగా కలిశారు. వృత్తిపరమైన చర్చలు, నిర్వహణపరమైన సరఫరా, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో ఈ నౌక పాల్గొంటుంది. ఇది భారత్, పోర్చుగల్ మధ్య సముద్రయాన బంధాలను మరింత బలపరుస్తుంది.

15,000 నాటికల్ మైళ్లకుపైగా ప్రయాణించిన ఐఎన్ఎస్ సుదర్శిని.. సత్సంబంధాలకు ప్రతీకగా, భారతదేశ సముద్రయాన చరిత్ర వైభవాన్ని చాటిచెప్పే రాయబారిగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2299463) సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil