ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి


పట్టుదలతో కూడిన శ్రమ, మానవ ప్రయత్నాల శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న పీఎం

प्रविष्टि तिथि: 14 AUG 2026 8:57AM by PIB Hyderabad

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందనికుటుంబాలు చెల్లాచెదురయ్యాయనిఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారనిచెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

కష్టాలను అధిగమించి ప్రజలువారి జీవితాలను పునర్మించుకున్నారనిప్రతికూల పరిస్థితులను విజయంగా మలచుకుంటూ దేశ పురోగతికి తోడ్పాటునందించారని ప్రధానమంత్రి స్పష్టం చేశారుసంకల్ప బలం ఎంత గొప్పదో వారి జీవిత ప్రయాణాలు మనకు తెలియజేస్తాయన్నారుదేశంలో ఐక్యతనుసౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ పురోగతికి కృషి చేసిన వారందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళులు అర్పించారుప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని వారి ధైర్యసాహసాలుసామర్థ్యాలు నిరూపించాయని పేర్కొన్నారుదేశ సద్భావనఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఒక సుభాషితాన్ని ప్రస్తావిస్తూ.. శ్రమపట్టుదలఅంకితభావంతో కూడిన ప్రయత్నాల వల్లే వివిధ కళలువిజ్ఞాన శాస్త్రంసాంకేతిక నైపుణ్యాలుహస్తకళలునూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయనిఇవి విజయానికి బాటలు వేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారుకేవలం అదృష్టాన్ని నమ్ముకుని ఉండిపోకుండా… ధైర్యంశ్రమ శక్తినిరంతర ప్రయత్నాలతో స్థిరంగా గమ్యం దిశగా సాగాలని తెలిపారుమానవ ప్రయత్నాలే భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం "ఎక్స్వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ఇవాళ మనం పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే నిర్వహిస్తున్నాందేశ విభజన వల్ల ప్రభావితమైన వారి ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకుందాంవిభజన వల్ల ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమై.. మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయిప్రియమైన వారిని కోల్పోయారుఎంతో వేదనను అనుభవించారు.

అదే సమయంలో ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారుకష్టాలను విజయాలుగా మలచుకున్నారుదేశ పురోగతికి ఎంతో కృషి చేశారువారి జీవిత ప్రయాణాలు సంకల్పబలాన్ని గుర్తుచేస్తాయి.

దేశంలో ఐక్యతనుసౌభ్రాతృత్వానని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నా"

"పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ ప్రగతికి అమూల్యమైన సేవలందించిన దేశవాసులందరికీ హృదయపూర్వక నివాళులుప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలతో సంకల్ప బలం గొప్పతనాన్ని నిరూపించారు.

 

***


(रिलीज़ आईडी: 2299374) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam