గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షెడ్యూల్డు తెగల వారి కోసం జాతీయ ఫెలోషిప్ పథకం

నాడు పోస్టు చేయడమైనది: 13 AUG 2026 2:23PM by PIB Hyderabad

షెడ్యూల్డు తెగల జాతీయ ఫెలోషిప్ పథకం (ఎన్ఎఫ్ఎస్‌టీ)లో భాగంగా గత అయిదు సంవత్సరాల్లో 3750 ఫెలోషిప్పులను అందించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే లోక్‌సభకు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో జిల్లా వారీగానూ, సంవత్సరం వారీగానూ పరిశోధక విద్యార్థులు చేరిన విద్యాసంస్థలు, కోర్సుల వివరాలను అనుబంధ పత్రం-1లో చూడవచ్చు.
ఎన్ఎఫ్ఎస్‌టీ కేంద్ర రంగ పథకం అయినందువల్ల రాష్ట్ర వారీ బడ్జెటు కేటాయింపునకు సంబంధించి దీనిలో ఎలాంటి ఏర్పాటూ లేదు. గత అయిదు సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్లో జిల్లా వారీ వాస్తవ చెల్లింపుల వివరాలను అనుబంధ పత్రం-2లో చూడవచ్చు.      
ఎన్ఎఫ్ఎస్‌టీ‌లో భాగంగా, దరఖాస్తులను ఆహ్వానించే వెబ్‌సైటును సాధారణంగా ప్రతి విద్యాసంవత్సరంలోనూ జులై 1న తెరిచి, సెప్టెంబరు 30న మూసేస్తారు. ఆ తరువాత, దరఖాస్తులను సరిచూస్తారు. ఎంపిక చేసిన 750 మంది అభ్యర్థుల మెరిట్ లిస్టును మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. తదనంతరం, ఫెలోషిప్ నిధులను విడుదల చేసే ప్రక్రియను మొదలుపెడతారు. అవసరమైన లాంఛనాలను అంటే, పరిశోధక విద్యార్థులు ఎప్పటి లోపల విద్యాసంస్థలో చేరేదీ, బ్యాంకు ఖాతాను జోడించడం, కంటిన్యూషన్ సర్టిఫికెట్టును సమర్పించడం వంటి  వివరాలను అందజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, ఈ పథకానికి బడ్జెట్టులో ఏమేరకు నిధులు అందుబాటులో ఉన్నాయన్న అంశాన్ని కూడా లెక్క లోకి తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఎన్ఎఫ్ఎస్‌టీ పథకం సహా ఉపకార వేతన పథకాలకు సంబంధించిన ఫిర్యాదులను సాధారణంగా సెంట్రలైజ్‌‌డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీజీఆర్ఏఎమ్ఎస్), పబ్లిక్ గ్రీవెన్స్ (పీజీ) వెబ్‌సైట్ ద్వారా అందుకుంటారు. వాటిని నిర్దిష్ట గడువు లోపల పరిష్కరిస్తారు.  2021 ఏప్రిల్ 1 మొదలు 2026 మార్చి నెల 31 వరకు సీపీజీఆర్ఏఎమ్ఎస్ పోర్టల్లో అందిన ఫిర్యాదులను పరిష్కరించడానికి పట్టిన కాలం ఈ కింది విధంగా ఉంది:

 

ఎన్ఎఫ్ఎస్‌టీ పథకం సహా ఉపకార వేతన సంబంధిత ఫిర్యాదులన్నింటి కోసం సీపీజీఆర్ఏఎమ్ఎస్, పీజీ వెబ్‌సైట్

పాత ఫిర్యాదుల సంఖ్య  

అందిన ఫిర్యాదుల సంఖ్య  

పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య

పరిష్కరించడానికి పట్టే సగటు కాలం (రోజుల్లో)

1

1680

1681

7


 

ఎన్ఎఫ్ఎస్‌టీలో భాగంగా వెనుకటి మూడు సంవత్సరాల్లో మొత్తం 2250 ఫెలోషిప్పులను అందజేశారు. గత మూడు సంవత్సరాల్లో తమ కోర్సులను, పరిశోధనను పూర్తి చేసిన పరిశోధక విద్యార్థుల సంఖ్యను ఈ కింది పట్టికలో చూడవచ్చు.

ఆర్థిక సంవత్సరం

పరిశోధనను పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య *

2023-24

294

2024-25

156

2025-26

226

* ప్రతి సంవత్సరంలో 750 ఫెలోషిప్పులను 5 సంవత్సరాల కాలానికి గాను ఇస్తున్నారు.

ఏటా 750 తాజా ఫెలోషిప్పులను గిరిజన వ్యవహారాల శాఖ మంజూరు చేస్తూ షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థులు  ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో పాలుపంచుకొనేటట్లు శ్రద్ధ వహిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2299076) సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil