శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: విజ్ఞాన్ టెక్ 2026
प्रविष्टि तिथि:
13 AUG 2026 2:07PM by PIB Hyderabad
2026 మే 11న జాతీయ సాంకేతికతా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని బ్రిక్-జాతీయ ఇమ్యునాలజీ సంస్థ (బ్రిక్ - ఎన్ఐఐ)లో ‘విజ్ఞాన్ టెక్’ కార్యక్రమాన్ని బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) నిర్వహించింది. విజ్ఞానశాస్త్రాలు, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మొదటిసారి ఈ వినూత్న కార్యక్రమాన్ని డీబీటీ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 14 మంత్రిత్వశాఖలు, విభాగాల సాంకేతిక సామర్థ్యాన్ని చాటేలా ఈ కార్యక్రమం సాగింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, పరిశోధనశాలలతో.. పరిశోధన - అభివృద్ధి పరంగా ఆయా శాఖలు, విభాగాల బలమైన అనుసంధానాన్ని ఇది ప్రదర్శించింది. అంతర్గతంగా అభివృద్ధి చేసిన వందకు పైగా సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ‘ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం’ ప్రాతిపదికగా... అంతరిక్ష - భౌగోళిక ప్రాదేశిక, వాతావరణ - వ్యవసాయాహార, బయోఫార్మా - ఆరోగ్య, జీవ పారిశ్రామిక - హరిత రసాయనాలు, డీప్‌టెక్ పదార్థాలు - అధునాతన ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు - ఇంధనం, సముద్ర అగాధ - వాతావరణ రంగం వంటి కీలక అంశాలకు సంబంధించి వివిధ సాంకేతికతలను ప్రదర్శించారు. ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలు అభివృద్ధి చేసిన దాదాపు 300 సాంకేతికతలతో రూపొందించిన ‘టెక్-సంగ్రహ’ అనే సంకలనాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వీటిలో చాలా సాంకేతికతలు ఇప్పటికే వాణిజ్యపరంగా వినియోగంలోకి వచ్చాయి లేదా లైసెన్సు పొందాయి. మరికొన్ని జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వినియోగానికి సిద్ధమవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పలు సాంకేతిక బదిలీలు/ సాంకేతికతల లైసెన్సు ప్రక్రియలను కూడా నిర్వహించారు. ఆ వివరాలిలా ఉన్నాయి:
డీబీటీ - బయోటెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణల మండలి (డీబీటీ- బ్రిక్)
-
పంటల్లో వేగవంతమైన ఆవిష్కరణలు - సాంకేతిక వేదిక
-
యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ సాంకేతికత
-
ఆప్టిమైజ్డ్ లిగ్నోసెల్యులోజిక్ డీగ్రెడేషన్ ఎంజైమ్ సాంకేతికత
-
క్లవర్ కప్
-
పెద్దపేగు వాపు వ్యాధుల కోసం ఎన్‌సీఈ
భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)
-
హీమోఫీలియా-ఎ వ్యాధి పరీక్ష కోసం ఫ్యాక్టర్ VIII ఇన్హిబిటర్ టెస్ట్
-
పీఎస్పీ94 ఎలిసా
-
డెంగ్యూ చికన్‌గున్యా, జికా వైరస్ ల కోసం మల్టీప్లెక్స్ రియల్ టైం ఆర్టీపీసీఆర్
కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)
-
సీఎస్ఐఆర్ ప్రైమా ఈటీ -11, 100% ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ట్రాక్టర్
ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ
-
ఎక్స్‌ట్రూడెడ్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ
-
హైబ్రిడ్ గ్రీన్ హౌస్ సోలార్ డ్రైయర్
-
ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్న గ్రానోలా బార్
కార్యక్రమ సందర్భంగా కింది సాంకేతికతలను కూడా ప్రారంభించారు:
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ
-
తిరువనంతపురంలోని సీ-డాక్ దేశీయంగా అభివృద్ధి చేసిన గ్లేజియర్ లేక్ బాతిమెట్రీ సర్వే సొల్యూషన్
కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)
-
వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా.. డీప్‌టెక్ ఆవిష్కరణలు, అనువాద పరిశోధన సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. 2042 నాటికి సీఎస్ఐఆర్ ప్రణాళికా మార్గాన్ని వివరించే ఒక చిన్న పుస్తకం సీఎస్ఐఆర్@100.
విజ్ఞాన వినిమయానికీ, సాంకేతికతల ప్రదర్శనకూ, ప్రయోగశాలల్లో పరిశోధనలు - పారిశ్రామిక వినియోగానికి నడుమ వ్యత్యాసాన్ని తగ్గించే అవకాశాల అన్వేషణకూ ఉమ్మడి వ్యూహాత్మక వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. వివిధ మంత్రిత్వశాఖలు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, యువ పరిశోధకులు, పారిశ్రామిక ప్రముఖులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులను ఒకే వేదికపైకి తేవడం ద్వారా.. ఆవిష్కరణ వ్యవస్థలో అనుసంధానాలను ఈ కార్యక్రమం బలోపేతం చేసింది. సహకారం, ఆవిష్కరణలకు సంబంధించి కొత్త అవకాశాలపై విలువైన సమాచారాన్ని అందించింది. వికసితభారత్ 2047 దిశగా మనం ప్రయాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. సంస్థాగతంగా అడ్డుగోడలను ఛేదించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు.
శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2299010)
आगंतुक पटल : 9