సహకార మంత్రిత్వ శాఖ
భారత్ ట్యాక్సీ ప్రారంభం
प्रविष्टि तिथि:
12 AUG 2026 5:16PM by PIB Hyderabad
బహుళ రాష్ట్రాల సహకార సంఘమైన సహకార్ ట్యాక్సీ కోపరేటివ్ లిమిటెడ్ (ఎస్టీఎస్ఎల్) ఆధ్వర్యంలో సహకార ఆధారిత డిజిటల్ రవాణా యాప్ భారత్ ట్యాక్సీ సేవలు ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని నగరాల్లో ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా దశల వారీగా భారత్ ట్యాక్సీ సేవలు అమల్లోకి వస్తాయి. గుర్తించిన నగరాలు, రాష్ట్రాల్లో సారథుల (డ్రైవర్లు) నమోదు, నియామకం, వినియోగదారుల నమోదు, శిక్షణ కార్యక్రమాలు, సేవల విస్తరణ ఈ అమలు ప్రక్రియలో భాగంగా ఉంటాయి. 04.08.2026 నాటికి ఈ వేదికలో 8.48 లక్షల సారథులు (డ్రైవర్లు), 44.27 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. రోజుకి 11,106 రైడ్లను ఈ వేదిక అందిస్తోంది. సారథులకు మొత్తం రూ.83.70 కోట్ల ఆదాయాన్ని అందించింది.
కార్యాచరణ అవసరాలు, అవసరమైన అనుమతులకు లోబడి ఇతర నగరాలు, రాష్ట్రాల్లో సహకార్ ట్యాక్సీ సహకార సంఘం (ఎస్‌టీసీఎల్) నిర్వహిస్తున్న భారత్ ట్యాక్సీ సేవల విస్తరణ ఉంటుంది. కార్యాచరణ సన్నద్ధత, అందుబాటులో సారథులు, చట్టబద్ధమైన అనుమతులను పొందడం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంస్థలు, ఇతర భాగస్వాములతో సమన్వయం లాంటి అంశాల ఆధారంగా విస్తరణ చేపడతారు.
04.08.2026 నాటికి, వివిధ నగరాల్లో భారత్ ట్యాక్సీ కార్యకలాపాల వివరాలు, రోజువారీ ప్రయాణాలు సగటు సవారీ వివరాలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
|
నగరం
|
రోజువారీ సగటు సవారీ
|
|
ఢిల్లీ–ఎన్‌సీఆర్
|
5574
|
|
గుజరాత్
|
3817
|
|
లక్నో
|
324
|
|
ఛండీగడ్
|
190
|
|
ముంబయి
|
197
|
|
జైపూర్
|
372
|
|
పుణే
|
632
|
|
మొత్తం
|
11,106.
|
వేర్వేరు సంస్థాగత వ్యవస్థల కింద పనిచేసే ప్రత్యేక రవాణా వేదికలే భారత్ ట్యాక్సీ, యాత్రీ సాథీ. బహుళ రాష్ట్ర సహకార సంస్థల చట్టం–2002 నిబంధనలకు అనుగుణంగా సహకార్ ట్యాక్సీ సహకార సంఘం (ఎస్‌టీసీఎల్) ద్వారా నిర్వహించే సహకార ఆధారిత రవాణా వేదిక భారత్ ట్యాక్సీ. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ విభాగం (డీఐటీఈ) నిర్వహిస్తున్న రవాణా వేదిక యాత్రీ సాథీ.
యాత్రీ సాథీ వేదికతో సహకారం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో 2026, జులై 19న ఒక అవగాహనా ఒప్పందాన్ని ఎస్‌టీసీఎల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డ్రైవర్ల నమోదు, సహకార సభ్యత్వం, డ్రైవర్ సంక్షేమం, ప్రజలకు చేరువ అవడం లాంటి అంశాల్లో భారత్ ట్యాక్సీ తన సహకారాన్ని అందిస్తుంది.
రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2298846)
आगंतुक पटल : 3