ప్రధాన మంత్రి కార్యాలయం
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సంకల్పం, పట్టుదల, నిరంతర కృషి ముఖ్యం ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 AUG 2026 7:37AM by PIB Hyderabad
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకోవడంలో సంకల్పం, పట్టుదల, ధైర్యానికున్న శక్తిని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుమ్।
న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి॥’’
ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకొనే సంకల్పం, పట్టుదల, ధైర్యం ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎన్నడూ ఓడిపోడు. బదులుగా, నిరంతర కృషి, చెక్కుచెదరని సంకల్పంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తాడు.
***
(రిలీజ్ ఐడి: 2298738)
సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam