ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్‌శక్తి కార్యక్రమం ద్వారా మహిళా అధికారుల సైబర్ భద్రతా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వం

प्रविष्टि तिथि: 12 AUG 2026 1:37PM by PIB Hyderabad

మహిళా సాధికారతపై స్టాండింగ్ కమిటీ-2026 ఇచ్చిన నివేదిక మేరకు సైబర్‌శక్తి కార్యక్రమ విస్తరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందిమహిళా ప్రభుత్వ ఉద్యోగుల్లో సైబర్ భద్రతా అవగాహనను పెంపొందించటంసైబర్ భద్రతా నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు అక్టోబర్ 2024 నుంచి రెండేళ్ల కాలపరిమితితో ఈ కార్యక్రమానికి ఆమోదం లభించిందిసైబర్ భద్రతపై పనిచేసే వర్కింగ్ గ్రూప్... మే 2026లో ఈ ప్రాజెక్టు రెండో దశను సిఫార్సు చేసింది.

2024లో ప్రారంభమైనప్పటి నుంచి సైబర్‌శక్తి కార్యక్రమం ద్వారా మహిళా పోలీసు అధికారులుసైబర్ విభాగ సిబ్బందిసైబర్ క్రైం బాధితులతో వ్యవహరించే మహిళా పోలీసు అధికారులతో సహా మొత్తం 978 మంది మహిళా ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణ పొందారుఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రెండు వారాల పాటు ఆన్‌లైన్ (వీఐఎల్‌టీవిధానంవారం రోజుల పాటు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించారురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల వారీగా సైబర్‌శక్తి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన మహిళా ప్రభుత్వ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.


 

క్రమ సంఖ్య

రాష్ట్రం

శిక్షణ పొందిన మహిళా అధికారుల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్

12

2

అస్సాం

11

3

బీహార్

11

4

ఛత్తీస్‌గఢ్

6

5

గోవా

7

6

గుజరాత్

81

7

హర్యానా

42

8

హిమాచల్‌ప్రదేశ్

30

9

జార్ఖండ్

11

10

కర్ణాటక

73

11

కేరళ

36

12

మధ్యప్రదేశ్

15

13

మహారాష్ట్ర

53

14

మణిపూర్

5

15

మేఘాలయ

16

16

మిజోరాం

2

17

నాగాలాండ్

1

18

ఒడిశా

32

19

పంజాబ్

12

20

రాజస్థాన్

29

21

సిక్కిం

1

22

తమిళనాడు

64

23

తెలంగాణ

28

24

త్రిపుర

19

25

ఉత్తరప్రదేశ్

45

26

ఉత్తరాఖండ్

32

27

పశ్చిమబెంగాల్

20

మొత్తం

 

694

 

క్రమ సంఖ్య

కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)

శిక్షణ పొందిన మహిళా అధికారుల సంఖ్య

1

అండమాన్నికోబార్ దీవులు

1

2

చండీగఢ్

7

3

దాద్రానగర్ హవేలీడామన్డయ్యూ

2

4

ఢిల్లీ

249

5

జమ్మూకాశ్మీర్

5

6

లద్దాఖ్

12

7

లక్షద్వీప్

1

8

పుదుచ్చేరి

7

మొత్తం

284

 

శిక్షణ కార్యక్రమాలతో పాటు సైబర్ భద్రత ప్రాముఖ్యతపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వెబినార్లలో 573 మంది మహిళలు పాల్గొన్నారు.

ఈ సమాచారాన్ని 07.08.2026న కేంద్ర ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికశాఖ సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద రాజ్యసభకు అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2298284) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil