భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమర్థ్ కేంద్రాల ద్వారా సుమారు 33000 మందికి శిక్షణ ఇచ్చిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 12 AUG 2026 11:26AM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధి కోసం దిగువ పేర్కొన్న కార్యక్రమాలను భారత మూలధన వస్తువుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకం పరిధిలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టింది.

1. ఇండస్ట్రీ 4.0ను ప్రోత్సహించడానికి నాలుగు స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్‌పార్మేషన్ హబ్ (సమర్థ్కేంద్రాలఏర్పాటు.

2.  అధునాతన వెల్డింగ్ సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యం కోసం తిరుచ్చిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు చెందిన వెల్డిండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐవద్ద కామన్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ సెంటర్ (సీఈఎఫ్‌సీఏర్పాటు.

3.  ఏఎస్‌డీసీ ద్వారా 23 అర్హత ప్యాకేజీల అభివృద్ధి

4.  సీజీఎస్ఎస్‌సీ ద్వారా 23 అర్హతా ప్యాకేజీల అభివృద్ధి

5.  ఐఏఎస్‌సీ ఎస్ఎస్‌సీ ద్వారా 12 అర్హతా ప్యాకేజీల రూపకల్పన

పథకాలుకార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ చర్యలను చేపట్టినట్టు నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈతెలిపిందిభారీ పరిశ్రమలుతయారీ రంగాలతో సహా అన్ని విభాగాల్లోనూ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన శిక్షణ సంస్థాన్ (జేఎస్ఎస్). జాతీయ అప్రెంటిస్ షిప్ ప్రోత్సాహక పథకం (ఎన్ఏపీఎస్)లాంటి ప్రతిష్ఠాత్మక పథకాలను ఎంఎస్‌డీఈ అమలు చేస్తోంది.

సుమారుగా 33000 మందికి సమర్థ్ కేంద్రాల ద్వారా భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ శిక్షణ ఇచ్చిందిఅలాగేగడచిన మూడేళ్లలో తిరుచ్చిలోని బీహెచ్ఈల్‌కు చెందిన డబ్ల్యూఆర్ఐ వద్ద ఉన్న సీఈఎఫ్‌సీ ద్వారా సుమారు 8500 మందికి పైగా శిక్షణ పొందారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (పీఎంకేవీవైపథకం ద్వారా వివిధ రంగాల్లో అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖ శిక్షణ ఇచ్చిందిఆర్థిక సంవత్సరం 2022–23 నుంచి పీఎంకేవీవై 4.0 అమల్లో ఉందిగత మూడేళ్లలో పీఎంకేవీవై 4.0 పరిధిలో 27,31,699 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు.

గత మూడేళ్లలో మూలధన వస్తువులతయారీ రంగంలో క్రాఫ్ట్స్‌మెన్ శిక్షణా పథకం (సీటీఎస్ద్వారా ఐటీఐల్లో చేరిన వారి మొత్తం సంఖ్య 12,53,158.

(సీ), (డీ):   ఎంఎస్‌డీఈ అందించిన సమాచారం ప్రకారం పీఎంకేవీవై4.0 పథకం డిమాండ్ ఆధారితమైనదిదీని ద్వారా నైపుణ్య అంతరాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రాజెక్టును అమలు చేసే సంస్థలు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా శిక్షణ కేంద్రాలకు (టీసీగుర్తింపు/అనుబంధ హోదా అభిస్తుంది. 30.6.2026 నాటికి పీఎంకేవీవై 4.0 పరిధిలో పాఠశాలలుకళాశాలలుఐటీఐలూవిశ్వవిద్యాలయాలునైపుణ్య విశ్వవిద్యాలయాలుపాలిటెక్నిక్‌లు వంటి 6,993 విద్యాసంస్థలతో సహా 16,946 శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2298184) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil