హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్‌) పరిధిలో ఈ-ఎఫ్ఐఆర్ నమోదు

प्रविष्टि तिथि: 11 AUG 2026 4:08PM by PIB Hyderabad

కేసు పెట్టదగిన నేరం జరిగినప్పుడుదానికి సంబంధించిన సమాచారాన్ని ఆ నేరం ఏ ప్రాంతంలో జరిగినప్పటికీపోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి సమక్షంలో మౌఖికంగాలేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారానైనా  తెలియజేయవచ్చునని ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)-2023’ లోని 173వ సెక్షన్‌ సూచిస్తోందినోటిమాటగా సమాచారాన్ని తెలియజేస్తేఅప్పుడు ఆ విషయాన్ని అధికారి కాగితాల్లో రాసుకుని నమోదు చేసుకుంటారు.  ఆ పత్రాలపై.. నేరం జరిగిందని తెలిపిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుందిసమాచారాన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రూపంలో తెలియజేసినట్లయితేసంబంధిత పోలీస్ స్టేషన్‌లోని అధికారి దానిని రాతపూర్వకంగా నమోదు చేసుకుని మూడు రోజుల లోపల ఆ పత్రాలపైవిషయాన్ని తెలియజేసిన వ్యక్తి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది-ఎఫ్ఐఆర్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా తెలియజేసిన సమాచారాన్ని రికార్డు చేయడానికిఆ సమాచారాన్ని అందించిన వ్యక్తి మూడు రోజుల గడువు లోపల సమాచార పత్రంపై సంతకాలు చేయవలసి ఉంటుందని ‘బీఎన్ఎస్ఎస్-2023’ సూచిస్తోంది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ ‌కుమార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా  సమాధానమిస్తూఈ విషయాలను తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2297769) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Assamese