హోం మంత్రిత్వ శాఖ
ఫోరెన్సిక్ సైన్స్ సంస్థ
प्रविष्टि तिथि:
11 AUG 2026 4:07PM by PIB Hyderabad
ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో విద్య, పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలను సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని (ఎన్‌ఎఫ్ఎస్‌యూ) ఏర్పాటు చేసింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం ఫోరెన్సిక్ సైన్స్‌తో పాటు అనువర్తిత ప్రవర్తనా శాస్త్రం, న్యాయశాస్త్రం, నేరశాస్త్రం, సాంకేతికత తదితర అనుబంధ రంగాల్లో విద్య, పరిశోధన, శిక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.
ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీనగర్, ఢిల్లీలో ఉన్న ప్రాథమిక ఎన్‌ఎఫ్ఎస్‌యూ క్యాంపస్‌లతోపాటు, దేశవ్యాప్తంగా మరో 14 కొత్త క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ కొత్త క్యాంపస్‌లను గోవా, అగర్తలా (త్రిపుర), భోపాల్ (మధ్యప్రదేశ్), ధార్వాడ్ (కర్ణాటక), గువాహటి (అస్సాం), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), ఖోర్ధా (ఒడిశా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), చెంగల్పట్టు (తమిళనాడు), రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇంఫాల్(మణిపూర్), పూణేలో (మహారాష్ట్ర) శిక్షణ కేంద్రాలను ఎన్‌ఎఫ్ఎస్‌యూ ఏర్పాటు చేసింది.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అందించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2297766)
आगंतुक पटल : 19