మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సీఈఆర్‌టీకి డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదా మంజూరు

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 4:15PM by PIB Hyderabad

డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను మంజూరు చేయాలని కోరుతూ న్యూఢిల్లీలోని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సమర్పించిన దరఖాస్తును యూజీసీ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ సంస్థలు) నియంత్రణలు-2023లోని నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) పరిశీలించింది. సమగ్ర అంచనా అనంతరం న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను మంజూరు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. యూజీసీ సలహాను పరిగణనలోకి తీసుకొని యూజీసీ చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం 30.03.2026న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పరిశోధనా కార్యక్రమాలతో పాటు డాక్టోరల్, వినూత్న విద్యా కార్యక్రమాలను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనే షరతుకు ఈ ప్రకటన లోబడి ఉంటుంది.

విద్యా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలోనూ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని పెంపొందించుకోవడంలోనూ ఎన్‌సీఈఆర్‌టీ సామర్థ్యాన్ని డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయ హోదా బలోపేతం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సాయం అందించే థింక్ ట్యాంకుగా, జాతీయ వనరుల సంస్థగా ఎన్‌సీఈఆర్‌టీ పోషిస్తున్న పాత్రను పటిష్టం చేస్తుంది. 

ఈ రోజు లోక్‌సభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297397) సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil