మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మళ్లీ టీఈటీ పరీక్ష... ఉపాధ్యాయుల ప్రతిస్పందన

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 3:49PM by PIB Hyderabad

విద్య రాజ్యాంగ ఉమ్మడి జాబితాలోని అంశం. ఉపాధ్యాయుల నియామకం, సేవా సంబంధిత షరతులు, వారిని ఎక్కడెక్కడకు పంపించాలనే అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికార పరిధిలోకి వస్తాయి.
‘బాలలకు ఉచిత, తప్పనిసరి విద్య హక్కు (ఆర్‌టీఈ) చట్టం-2009’ లోని 23వ సెక్షన్లో నిర్దేశించిన కనీస అర్హతలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) ఒకటనీ, ఇది ఈ చట్టం పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో టీచరుగా నియామకానికి తప్పనిసరి అనీ సర్వోన్నత న్యాయస్థానం 2025 సెప్టెంబరు 1న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. తీర్పులో ప్రస్తావించిన గడువు లోగా నిర్ణీత టీఈటీ అర్హత సంపాదించుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వును ఈ కింద పేర్కొన్న లింకులో చూడవచ్చును:
https://api.sci.gov.in/supremecourt/2018/36466/36466_2018_9_1501_63764_Judgement_01-Sep 2025.pdf 
ఆ తరువాత, ఇదే అంశంలో రివ్యూ పిటిషన్లను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు 2026 మే నెల 29న ఇచ్చిన తీర్పులో టీఈటీ అర్హతను ఉపాధ్యాయులు ఉత్తీర్ణులు కావడానికి గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 వరకూ పొడిగించింది. సంబంధిత ప్రభుత్వాలు, లేదా అధికార యంత్రాంగాలు పరీక్షల్ని నిర్వహించే క్రమంలో టీఈటీని ఏటా రెండుసార్లు నిర్వహించాలనీ, వాటిని సుమారు 6 నెలల విరామంతో నిర్వహించాలనీ, ఇలా చేస్తే అర్హత కల టీచర్లకు నిర్ణీత కనీస అర్హతను నెరవేర్చడానికి తగినంత అవకాశం లభిస్తుందనీ సుప్రీంకోర్టు తెలిపింది. 2026 మే 29 నాటి కోర్టు తీర్పు పాఠాన్ని ఈ కింది లింకులో చూడవచ్చును:
https://api.sci.gov.in/supremecourt/2025/53434/53434_2025_7_1501_71637_Judgement_29-May 2026.pdf
‘బాలలకు ఉచిత, తప్పనిసరి విద్య హక్కు (ఆర్‌టీఈ) చట్టం-2009’ అమల్లోకి రాక ముందు నియామకం పూర్తయి విద్యాబోధనలో నిమగ్నమైన టీచర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ 142వ అధికరణం ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి 2025 సెప్టెంబరు 1న తీర్పు ఇచ్చిన రోజుకు అయిదు సంవత్సరాల కన్నా తక్కువ సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు టీఈటీ అర్హతను సంపాదించుకోకపోయినా పదవీ విరమణ వయసు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగవచ్చని ఆదేశించింది. అలాంటి ఉపాధ్యాయులు టీఈటీ ఉత్తీర్ణతను సాధించకుండా పదోన్నతిని పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297373) సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil