ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియాటిక్ సింహాల సంరక్షణలో భారత్ అద్భుత పునరాగమనం.. ఓ ప్రత్యేక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 2:39PM by PIB Hyderabad

భారత్‌కు చెందిన ఆసియా సింహాల సంఖ్య వృద్ధి చెందడంపై కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేడు ప్రజలతో పంచుకున్నారు. ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, వాటి ఆవాస ప్రాంతం, సంచరించే పరిధి కూడా విస్తరిస్తుస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న పటిష్టమైన నిబద్ధత, దానికి తోడైన ప్రజల భాగస్వామ్యం కలిసి వన్యప్రాణులను కాపాడటంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచాయన్నారు.. రాబోయే తరాల కోసం ఈ జీవజాతులను పరిరక్షించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

ఇదొక అద్భుతం! దేశంలో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాటి ఆవాస ప్రాంతం, సంచరించే పరిధి కూడా విస్తరిస్తోంది.

 

ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధత, మన వన్యప్రాణులను రక్షించి, భావితరాల కోసం ఈ జాతిని సంరక్షించడానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది.

కేంద్రమంత్రి శ్రీ భూపేందర్‌ యాదవ్‌ రాసిన ఈ వ్యాసాన్ని చదవండి.

 

 

***

MJPS/SS/VJ


(రిలీజ్ ఐడి: 2297120) సందర్శకుల సూచీ సంఖ్య : : 124