పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో సెస్నా సీ172 శిక్షణ విమానం రన్‌వేను దాటి బయటకు వెళ్లిన సంఘటన

నాడు పోస్టు చేయడమైనది: 09 AUG 2026 6:42PM by PIB Hyderabad

09 ఆగస్టు 2026న మధ్యాహ్నం సుమారు 12:25 గంటల సమయంలో డీజీసీఏ ఆమోదం ఉన్న 'అకాడమీ ఆఫ్ కార్వర్ ఏవియేషన్'కు చెందిన సెస్నా సీ172 రకం శిక్షణ విమానం (రిజిస్ట్రేషన్: వీటీ-ఎస్‌ఈఎక్స్) మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో రన్‌వేను దాటి బయటకు వెళ్లింది. 

ఈ విమానాన్ని సర్క్యూట్, ల్యాండింగ్ ఎమర్జెన్సీస్ (సీఎల్ ఎమర్జెన్సీస్) శిక్షణ కోసం నడుపుతున్నారు. విమానంలో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయ్‌ఫోడేతో పాటు ట్రైనీ పైలట్ అభిజీత్ జుంద్రే ఉన్నారు. 

శిక్షణ విన్యాసాల కోసం విమానం సుమారు 12:09 ఐఎస్‌టీ (0639 యూటీసీ) గంటలకు టేకాఫ్ కోసం రన్‌వే వైపునకు వెళ్లింది. అనంతరం లింక్ బ్రావో ద్వారా రన్‌వే పైకి ప్రవేశించి రన్‌వే 29 వద్ద సిద్ధంగా ఉంది. అనంతరం ‘రిజెక్టెడ్ టేక్- ఆఫ్ విన్యాసాన్ని’ నిర్వహించింది. ఆ తర్వాత రన్‌వే 11 లో మరో రిజెక్టెడ్ టేక్-ఆఫ్ విన్యాసం చేపట్టింది. 

ఈ విన్యాస సమయంలో విమానం రన్‌వే దాటి పక్కకు వెళ్లింది. రన్ వే ఉపరితలం దాటి పూర్తిగా కుడివైపునకు వెళ్లిపోయింది.

ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కానీ ప్రాణనష్టం కానీ నమోదు కాలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం విమానం ప్రొపెల్లర్, ఇంజిన్ కౌలింగ్, నోస్ ల్యాండింగ్ గేర్‌లకు నష్టం వాటిల్లింది. నష్టంపై సమగ్ర అంచనాను సంబంధిత అధికారిక వర్గాలు నిర్వహించనున్నాయి.

ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై ప్రాథమిక విచారణ జరిపేందుకు డీజీసీఏ ఎయిర్ సేఫ్టీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటోంది. వివరాలు నిర్ధారించిన తర్వాత తదుపరి సమాచారం అందిస్తాం.

 

***


(రిలీజ్ ఐడి: 2296963) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil