ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
07 AUG 2026 11:14AM by PIB Hyderabad
ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సుసంపన్నమైన, శక్తిమంతమైన చేనేత వారసత్వాన్ని కొనియాడారు. దేశంలోని చేనేత కార్మికులు, కళాకారుల నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ప్రధాని కొనియాడారు. తరతరాలుగా తమ నైపుణ్యంతో భారతదేశ సంప్రదాయాలను పరిరక్షించి, సుసంపన్నం చేశారన్నారు.
చేనేత రంగానికి తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. గ్రామీణ సాధికారతలో, మహిళా కేంద్ర అభివృద్ధిలో, ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో ప్రధానాంశంగా ఈ రంగాన్ని వర్ణించారు. సామాజిక మాధ్యమాల్లో తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తుల గురించి, జీఆర్‌డబ్య్లూఎం వీడియోలను పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
భారతదేశ సుసంపన్నమైన, శక్తిమంతమైన చేనేత వారసత్వాన్ని ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. మన చేనేత కార్మికులు, కళాకారుల నైపుణ్యానికి, సృజనాత్మకతకు, అంకితభావానికి నమస్సులు అర్పిస్తున్నాం. తరతరాలుగా వారు మన సంప్రదాయాలను పరిరక్షించి, సుసంపన్నం చేశారు.
గ్రామీణ సాధికారత, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడంలో కీలకమైన చేనేత రంగానికి మా ప్రభుత్వం మద్దతును కొనసాగిస్తూనే ఉంటుంది.
ఈ రంగానికి చెందినవారిని ప్రోత్సహించేలా #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించి మీకు ఇష్టమైన చేనేత ఉత్పత్తుల గురించి, జీఆర్‌డబ్ల్యూఎం వీడియోలను పంచుకోండి.
(रिलीज़ आईडी: 2296155)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam