రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

చారిత్రక క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవ రాజ్యసభ ఛైర్మన్ ప్రసంగం

प्रविष्टि तिथि: 07 AUG 2026 1:29PM by PIB Hyderabad

ఛైర్మన్గౌరవ సభ్యులారా… దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి ఆగస్టు 9, 2026నాటికి 84 ఏళ్లు పూర్తవుతాయిమహాత్మాగాంధీ నాయకత్వంలో ఆగస్టు 9, 1942న ప్రారంభమైన ఈ ఉద్యమందేశ స్వాతంత్ర్య కాంక్షకు ఊతమిచ్చింది. "డు ఆర్ డైపిలుపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించిందిఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొనిస్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో ప్రజలంతా ఐక్యంగా నిలబడేలా చేసింది.

భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల మన స్వాతంత్ర్య సమరయోధులు అసాధారణమైన ధైర్యాన్నిపట్టుదలనుఅచంచలమైన నిబద్ధతను ప్రదర్శించారుఅణచివేతనుకారాగార శిక్షలనులెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టువిడవలేదువారి నిస్వార్థ త్యాగాలుదృఢమైన సంకల్పం జాతీయ ఉద్యమాన్ని మరింత బలపరిచాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేందుకు మార్గాన్ని సుగమం చేశాయి.

ఈ చరిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాంవారి దేశభక్తిఐక్యతత్యాగంఅంకితభావం వంటి ఆదర్శాలు… బలమైనఅభివృద్ధి చెందినసమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలన్న ఉమ్మడి ప్రయత్నాలకు నిరంతరం స్ఫూర్తిని కలిగిస్తాయి.

ఈ సభలోని సభ్యులంతా నాతో కలిసి మన స్వాతంత్ర్య పోరాట వీరులకు నివాళులు అర్పిస్తారని నేను ఆశిస్తున్నాను.

గౌరవ సభ్యులారా… ఆ సాహస వీరుల జ్ఞాపకార్థందయచేసి అందరూ లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరుతున్నాను.

 

***

 

(रिलीज़ आईडी: 2295998) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati