సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ఉద్దేశం, అర్హతా ప్రమాణాలను స్పష్టం చేసిన ప్రభుత్వం


రాజ్యాంగ (103వ సవరణ) చట్టం-2019 ద్వారా 10 శాతం వరకు రిజర్వేషన్‌

ప్రస్తుత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిబంధనలను సవరించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని వెల్లడి

प्रविष्टि तिथि: 05 AUG 2026 6:41PM by PIB Hyderabad

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు)షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), సామాజికంగావిద్యపరంగా వెనకబడిన తరగతుల (ఎస్ఈబీసీలకోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత రిజర్వేషన్ పథకాల పరిధిలోకి రానిఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడమే ఈ రిజర్వేషన్ పాలసీ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

లోక్‌సభలో గౌరవ సభ్యులు శ్రీ విజయ్ బఘేల్‌ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్వర్మ ఈ సమాచారాన్ని పంచుకున్నారువిద్యాసంస్థల్లో ప్రవేశాలుప్రభుత్వ ఉద్యోగాలుసేవల్లో నియామకాలకు సంబంధించి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం వరకు రిజర్వేషన్ కల్పించడం కోసం రాజ్యాంగ (103వ సవరణచట్టం-2019 ద్వారా రాజ్యాంగంలో 15(6), 16(6) ప్రకరణలను చేర్చినట్లు సభకు తెలియజేశారు.

ప్రస్తుత రిజర్వేషన్ పథకాల పరిధిలోకి రానిరూ.8 లక్షల కంటే తక్కువ స్థూల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్ ప్రయోజనం కల్పించడం కోసం వారిని ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూస్)గా గుర్తిస్తారని లిఖితపూర్వక సమాధానంలో వివరించారుకుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండాఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి... 1,000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల నివాస ఫ్లాట్... నోటిఫైడ్ బల్దియాల పరిధిలో 100 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల నివాస స్థలం... లేదా నోటిఫైడ్ బల్దియా కాని ప్రాంతాల్లో 200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల నివాస స్థలం ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులను ఈడబ్ల్యూఎస్ గుర్తింపు నుంచి మినహాయించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్ పాలసీ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం... ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించుటకు సంబంధించిన నిబంధనను కలిగి ఉన్న 'ది ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీసెస్ (షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగలుఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్) (సవరణబిల్లు-2022ఇంకా ఆమోదం పొందలేదని సభకు తెలియజేశారుఈ కారణంగాచత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానం అమలు కాలేదు.

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను సమీక్షించుట లేదా సవరించుట గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా... మంత్రిత్వ శాఖలో అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని సభకు తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2295295) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada