మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ, డిజిటల్ విద్య

प्रविष्टि तिथि: 05 AUG 2026 6:15PM by PIB Hyderabad

విద్యార్థుల్లో కీలక నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠ్యాంశాలుబోధనా విధానాల్లో సమగ్ర మార్పులు చేపట్టాలని జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) - 2020 నిర్దేశించిందిఇందులో భాగంగా వివిధ  విద్యా దశల్లో కృత్రిమ మేధడిజైన్ థింకింగ్సమగ్ర ఆరోగ్యంసేంద్రీయ జీవన విధానంపర్యావరణ విద్యప్రపంచ పౌరసత్వ విద్య (జీసీఈడీవంటి సమకాలీన అంశాలను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని ఎన్ఈపీ–2020 స్పష్టం చేసింది.

భవిష్యత్తు  లో అభివృద్ధితో పాటు కృత్రిమ మేధమెషిన్ లెర్నింగ్డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ ప్రపంచ నాయకత్వం సాధించాలంటే గణితంగణితపరమైన కంప్యూటేషనల్ఆలోచనా విధానం అత్యంత కీలకమని కూడా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) - 2020లోని పేరా 4.25 పేర్కొంది ఆ విధంగా పాఠశాల విద్య పునాది దశ నుంచే గణితంకంప్యూటేషనల్ ఆలోచనా విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్ఈపీ -2020 సూచించిందిఇందుకోసం గణిత అభ్యాసాన్ని ఆసక్తికరంగాఆనందదాయకంగా మార్చే పజిల్స్ఆటలు వంటి వినూత్న బోధనా విధానాలను విస్తృతంగా వినియోగించాలని పేర్కొందిమాధ్యమిక విద్యా దశ నుంచే విద్యార్థులకు కోడింగ్ కార్యకలాపాలను పరిచయం చేయాలని కూడా సిఫార్సు చేసింది.

పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ పాఠ్యప్రణాళిక  (ఎన్సీఎఫ్ ఎస్ఈ) 2023  కింద విద్యార్థులకుసమాజానికి ప్రపంచస్థాయిలో గణిత విద్య ప్రాముఖ్యత గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందికృత్రిమ మేధ,  మెషిన్ లెర్నింగ్డేటా సైన్స్వాతావరణ నమూనాల రూపకల్పన,  మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కీలక రంగాలతో గణితానికి ఉన్న సన్నిహిత సంబంధం దృష్ట్యాభారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో గణిత బోధన పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన అంశమని ఎన్‌సీఎఫ్ ఎస్ఈ, 2023 పేర్కొంది.

కృత్రిమ మేధమెషిన్ లెర్నింగ్బిగ్ డేటా అనలిటిక్స్డేటా విజువలైజేషన్ వంటి సాంకేతికతలు విద్యారంగంలో వినూత్న అనువర్తనాలకు దోహదపడతాయని కూడా ఎన్‌సీఎఫ్–ఎస్ఈ -2023 పేర్కొందిబోధనఅభ్యాస,  మూల్యాంకన ప్రక్రియలను మెరుగుపరచడానికీఉపాధ్యాయుల సన్నద్ధతనువృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికీవిద్యావకాశాల లభ్యతను పెంచడానికీ విద్యా ప్రణాళికనిర్వహణపరిపాలనను క్రమబద్ధీకరించడానికీ కృత్రిమ మేధమెషిన్ లెర్నింగ్డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పాటు ఇమ్మర్సివ్ (ఏఆర్వీఆర్/వర్చువల్ ల్యాబ్‌లు), ఇంటరాక్టివ్గేమిఫైడ్ కంటెంట్‌ను ఉపయోగించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.

విద్యారంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తోందివిద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనతెలివైన మూల్యాంకనంపరిస్థితులకు తగ్గ బోధనా విధానాలుడేటా ఆధారిత నిర్ణయాలకు ఏఐ దోహదపడుతోంది. 21వ శతాబ్దంలో ఏఐని అత్యంత కీలక సాంకేతికతగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ–2020, ఎన్‌సీఎఫ్ ఎస్ఈ - 2023 ద్వారా పాఠశాల విద్యలో గణనాత్మక ఆలోచన విధానంకృత్రిమ మేధను సమగ్రంగా అనుసంధానించేందుకు చర్యలు ప్రారంభించింది.

దీనికి అనుగుణంగాజాతీయ విద్యా పరిశోధనశిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో కలిసి 2026–27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యేక కంప్యూటేషనల్ థింకింగ్కృత్రిమ మేధ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది.  9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కృత్రిమ మేధఅనుబంధ అంశాలకు సంబంధించిన పాఠ్యప్రణాళికను కూడా ఖరారు చేసిందిఈ పాఠ్యప్రణాళికలో తార్కిక ఆలోచననమూనాలను గుర్తించే సామర్థ్యంఅల్గారిథమ్ రూపకల్పనడేటా అక్షరాస్యత  వంటి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చారు.  బాధ్యతాయుతమైననైతిక విలువలతో కృత్రిమ మేధ  వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారుసమస్య పరిష్కారంసృజనాత్మకతవినూత్న ఆలోచనలను మిళితం చేయడం ద్వారాఈ ప్రణాళిక గణనాత్మక ఆలోచననుఏఐ  అభ్యాసానికి పునాదిగా ఈ ప్రణాళికను రూపొందించారుదీంతో విద్యార్థులు ప్రతి తరగతిలో తమ వయస్సుకు అనుగుణంగా దశలవారీగా ఏఐపై అవగాహననైపుణ్యాలను పెంపొందించుకునేలా అవకాశం కల్పించింది.

ఏఐ బోధనను సమర్థంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయుల కోసం టీచర్ హ్యాండ్‌బుక్స్, ఫెసిలిటేటర్  గైడ్లను కూడా రూపొందించారువీటిని సీబీఎస్ఈ అకడమిక్ వెబ్‌సైట్‌ (https://cbseacademic.nic.in/skilleducation.html). లో అందుబాటులో ఉంచారుపాఠశాలల్లో ఏఐ బోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా పొందుపరిచిందిఏఐను ఒక సబ్జెక్టుగా అభ్యసించే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత సంబంధిత పాఠశాలలదేనని పేర్కొందిసీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు బోర్డు అనుబంధ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉంటుంది.

నైపుణ్యాభివృద్ధిపరిశ్రమల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థులుఉపాధ్యాయుల్లో కృత్రిమ మేధపై అవగాహనప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ ఎస్ఓఏఆర్‌పేరుతో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిందిఈ కార్యక్రమం కింద 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఒక్కోటి 15 గంటల వ్యవధి గల మూడు దశల శిక్షణ మాడ్యూళ్లను -  ఏఐ టు బి అవేర్ఏఐ టు అక్వైర్ఏఐ టు ఆస్పైర్ నూఉపాధ్యాయుల కోసం ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ పేరుతో 45 గంటల ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ నూ రూపొందించారుఈ కార్యక్రమంలో ఏఐ మౌలిక అంశాలుజనరేటివ్ ఏఐరోజువారీ జీవితంలో ఏఐ వినియోగంప్రోగ్రామింగ్ ప్రాథమికాలునైతిక విలువలుసైబర్ భద్రతభవిష్యత్ ఉపాధి అవకాశాలు వంటి అంశాలను బోధిస్తారు.

విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దేశంలోని అత్యధిక పాఠశాలలు రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోనే ఉన్నాయిదానికి అనుగుణంగాతమ అధికార పరిధిలోని పాఠశాలల్లో ఏఐ,  రోబోటిక్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసే బాధ్యత సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలదే.

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2295189) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी