బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంలో సంస్కరణలు
प्रविष्टि तिथि:
05 AUG 2026 1:58PM by PIB Hyderabad
బొగ్గు గనుల కేటాయింపులు, గనుల తవ్వకాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, శాస్త్రీయంగా మార్చేందుకు ఐదేళ్లుగా ప్రభుత్వం.. నిర్మాణపరమైన, విధానపరమైన సంస్కరణలను అమలు చేసింది. నామినేషన్ పద్ధతిలో కేటాయింపుల నుంచి బహిరంగ వేలం ద్వారా కేటాయించే విధానానికి మారటం ప్రధానమైన మార్పు. 2020లో వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకాలను ప్రారంభించటం ద్వారా బొగ్గు అమ్మకం, దాని తుది వినియోగంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
1. పారదర్శకత, మార్కెట్ ఆధారంగా కేటాయింపులకు కీలక సంస్కరణలు:
-
వాణిజ్య బొగ్గు గనుల తవ్వకం: ఎలాంటి సాంకేతికత లేదా ఆర్థిక అర్హత నిబంధనలు లేకుండా ప్రారంభించి, ఆటోమేటిక్‌గా వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతి ఉంటుంది.
-
రాబడి-వాటా నమూనా: జాతీయ బొగ్గు సూచీ ప్రవేశపెట్టడంతో వేలం శాతం ఆధారంగా రాబడి-వాటా నమూనాలోకి మారాయి. ఇది పారదర్శకమైన, మార్కెట్-అనుసంధాన ధరల నిర్ణయానికి మద్దతిస్తుంది.
-
సింగిల్ విండో మోడ్ అగ్నాస్టిక్ వేలం: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కు అనుసంధానం లేని బొగ్గు మొత్తాన్ని ఒకే వేదిక ద్వారా విక్రయించేందుకు, మార్కెట్ లోపాలను తొలగించేందుకు... కొనుగోలుదారుల మధ్య సరైన పోటీని పెంపొందించటానికి దీన్ని ప్రవేశపెట్టారు.
-
శక్తి విధాన సరళీకరణ: బొగ్గు అనుసంధాన కేటాయింపులను రెండు విండోలుగా సరళీకరించారు. విండో-I ప్రకటించిన ధర వద్ద, విండో-II ప్రకటించిన ధర కన్నా ప్రీమియం ధర వద్ద. దీనివల్ల ఇప్పటికే అనుసంధానమైన వినియోగదారులు పీఎల్‌ఎఫ్ అవసరం మేరకు వంద శాతం కొనుగోలు చేయగలుగుతారు.
-
కోల్‌సేతు విండో: నియంత్రణేతర రంగం (ఎన్ఆర్ఎస్) అనుసంధాన వేలం విధానం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తుది-వినియోగ పరిమితులు లేకుండా వేలం ఆధారిత అనుసంధానాలను అందించటానికి, స్వీయ వినియోగం, బొగ్గు శుద్ధి లేదా ఎగుమతి చేసుకోవటానికి పూర్తి వెసులుబాటును కల్పిస్తుంది.
2. పనితీరు మెరుగుదల, సులభతర వ్యాపార నిర్వహణకు సంస్కరణలు:
-
సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్: గనుల నిర్వహణను వేగవంతం చేసేందుకు పరివేశ్ 2.0 పోర్టల్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు.
-
అన్వేషణ: లైసెన్స్ అవసరం లేకుండా 44 ప్రైవేట్ సంస్థలను గుర్తింపు పొందిన అన్వేషణ సంస్థలు (ఏపీఏ)గా ప్రకటించారు. జియోలాజికల్ నివేదికల ఆమోద ప్రక్రియను కూడా సులభతరం చేశారు.
-
శాసన సవరణలు: గనుల ప్రారంభ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని కోల్ కంపెనీ బోర్డులకు కల్పించేలా కొల్లరీ కంట్రోల్ నిబంధనలను సవరించారు. ఎంఎండీఆర్ చట్టం-1957 ద్వారా కోకింగ్ కోల్‌ను కీలక, వ్యూహాత్మక ఖనిజంగా ప్రకటించారు. దీనివల్ల కోకింగ్ కోల్ ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం అవుతుంది.
-
మైన్ డెవలపర్, ఆపరేటర్ (ఎండీఓ) విధానం: బొగ్గు తవ్వకాల కోసం ప్రభుత్వం మైన్ డెవలపర్, ఆపరేటర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గరిష్ఠ స్థాయిలో వనరులను వెలికితీసేందుకు మూతపడిన, వదిలేసిన గనులను రాబడి-వాటా నమూనా ద్వారా కేటాయించింది.
-
కోల్ బ్లాక్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్లలో పనితీరు భద్రత సమర్పించేందుకు ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్‌ను ఆమోదయోగ్యమైన సాధనంగా చేర్చారు. ఇది బ్యాంకు గ్యారెంటీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. నిలిచిపోయిన కార్యాచరణ పెట్టుబడిని విడుదల చేస్తుంది. భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుంది.
సాంకేతికతను జోడించటం, పర్యావరణహిత బొగ్గు విధానాల ద్వారా బొగ్గు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.
-
కోల్ వాషింగ్: 'మిషన్ కోకింగ్ కోల్' ద్వారా దేశంలోని బొగ్గు శుద్ధి సామర్థ్యాన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 58 ఎంటీలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
-
డిజిటల్ మైన్ మానిటరింగ్: బొగ్గు ఉత్పత్తి, పంపిణీ, నిల్వలు రవాణా వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కోయ్లా శక్తి డాష్‌బోర్డును బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అదనంగా అనధికారిక మైనింగ్ కార్యకలాపాలపై పౌరులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఖనన్ ప్రహారి మొబైల్ యాప్, సీఎంఎస్ఎంఎస్ వెబ్ యాప్‌లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కృత్రిమ మేధ ఆధారిత వీడియో అనలిటిక్స్, ఆర్ఎఫ్ఐడీ-ప్రారంభించిన కొలతల కేంద్రం, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్, శాస్త్రీయ గనుల ప్రణాళిక కోసం డ్రోన్, ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్‌తో సమీకృత కమాండ్, నియంత్రణ కేంద్రాలను (ఐసీసీసీ)ను సీఐఎల్ ఏర్పాటు చేసింది.
-
కోల్ గ్యాసిఫికేషన్ & యూసీజీ: ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు 2030 నాటికి 100 ఎంటీ గ్యాసిఫికేషన్ సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు రూ. 8,500 కోట్ల (దీనిద్వారా ఇప్పటికే 8 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి), రూ. 37,500 కోట్ల ఆర్థిక కేటాయింపులతో ప్రభుత్వం రెండు ప్రధాన పథకాలను ఆమోదించింది.
-
పునరుత్పాదక శక్తి & కార్బన్ క్యాప్చర్: దశలవారీ పునరుత్పాదక ఇంధన ప్రణాళికను సీఐఎల్ చేపట్టింది. దీని ప్రకారం 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 3 జీడబ్ల్యూ, 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 9.5 జీడబ్ల్యూ... నెట్-జీరో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా వినియోగ, సొంత అవసరాల ప్రాజెక్టుల ద్వారా 558 మెగావాట్ల సామర్థ్యం ఏర్పాటైంది.
దేశ ఇంధన అవసరాలను తీర్చటంలో, పారిశ్రామిక వృద్ధికి మద్దతివ్వటంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.
మొక్కల పెంపకం, జీవ పునరుద్ధరణ, పర్యావరణహిత పార్కుల అభివృద్ధి, గనుల నీటి వినియోగం వంటి కార్యక్రమాల ద్వారా బొగ్గు తవ్వకాల్లో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సంప్రదాయ డ్రిల్లింగ్ విధానాలకు (ఉపరితల తవ్వకాలు) బదులుగా పేలుళ్లు లేని మైనింగ్ సాంకేతికతలను విస్తృతంగా అవలంబిస్తోంది.
దేశీయ బొగ్గు ఉత్పత్తి 2019-20లో సుమారు 731 మిలియన్ టన్నుల నుంచి గణనీయంగా పెరిగి, వరుసగా రెండేళ్లపాటు ఒక బిలియన్ టన్ను దాటింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1047.52 ఎంటీలకు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1039 ఎంటీలకు చేరుకుంది.
సమగ్ర బొగ్గు లాజిస్టిక్స్ ప్రణాళికను ప్రభుత్వం ప్రారంభించింది. రైలు, రోడ్డు, తీరప్రాంత రవాణా, అంతర్గత జలమార్గాల ద్వారా సాంకేతికతతో, తక్కువ ఖర్చుతో కూడిన మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయటం దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా సుమారు 1,319 మిలియన్ టన్నుల మొత్తం సామర్థ్యంతో 139 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులను చేపట్టగా అందులో ఇప్పటికే సుమారు 589 మిలియన్ టన్నుల సామర్థ్యం గల 72 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
ఈ రంగాన్ని మరింత క్రమబద్దీకరించేందుకు బొగ్గు, శుద్ధి చేసిన బొగ్గు వాణిజ్యానికి నియంత్రిత ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేసేందుకు బొగ్గు మార్పిడి నిబంధనలు-2026ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ బొగ్గు మార్పిడి ద్వారా సొంత, వాణిజ్య గనుల యజమానులు, వినియోగదారులు డెలివరీ ఆధారిత ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలవుతుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ఇవాళ లోక్‌సభలో ఒక రాతపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2294999)
आगंतुक पटल : 7