సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకం

प्रविष्टि तिथि: 04 AUG 2026 5:08PM by PIB Hyderabad

బీహార్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాధించిన పురోగతి వివరాలు ‘అనుబంధం-ఏ’లో ఉన్నాయి

మధ్యప్రదేశ్ వద్ద మిగులు నిల్వ సామర్థ్యం ఉందని అందుకే సహకార రంగంలో వికేంద్రీకృత పథకం కింద భాగస్వామ్యం వహించడం లేదని ఆ రాష్ట్రం తెలిపిందిఅయితే ఆ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా పరసవాడ సమితిలో ఒక గోదాంను నిర్మించారు.

ఈ రోజు నాటికి బీహార్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్‌లలో వికేంద్రీకృత గోదాంలుయంత్ర పరికరాల అద్దె కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్స్), చౌక ధరల దుకాణాలు నిర్మించిన లేదా ప్రారంభించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (ప్యాక్స్మొత్తం వివరాలు ‘అనుబంధం-బీ’లో ఉన్నాయి

బీహార్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సహకార నిల్వ కేంద్రాలకు (కోఆపరేటివ్ స్టోరేజ్ యూనిట్లుమద్దతుగా ఏఎంఐ (అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్పథకం కింద విడుదల చేసిన సబ్సిడీ వివరాలు ‘అనుబంధం-సీ’లో ఉన్నాయిఇప్పటివరకు ఏఎంఐ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సబ్సిడీ ఏదీ విడుదల కాలేదు.

సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ పథకం కింద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (ప్యాక్స్సహా అర్హత కలిగిన సహకార సంఘాలు తమ సొంత భూమిలో గానీ లేదా కౌలు భూమిలో గానీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చుఅవసరమైన చోట సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు స్థలాల కేటాయింపును సులభతరం చేస్తాయిఅన్ని నిల్వ కేంద్రాలు నిర్ణీత సాంకేతిక ప్రమాణాలుడబ్ల్యూడీఆర్ఏ నిర్దేశాల ప్రకారం నిర్మాణమౌతాయిఇప్పటివరకు బీహార్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిర్మాణ భద్రతకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదు

ఈ పథకం కింద నిర్మించిన గోదాంలు డబ్ల్యూడీఆర్ఏ (వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీఫ్రేమ్‌వర్క్ కింద నమోదు అవుతాయిఅర్హత కలిగిన ప్యాక్స్సహకార సంఘాలు ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ (ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీప్ట్వ్యవస్థ ద్వారా ప్రయోజనాలను పొందేలావాటిని డబ్ల్యూడీఆర్ఏ వద్ద నమోదు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయిబీహార్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ రాష్ట్రాలు డబ్ల్యూడీఆర్ఏ ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ వ్యవస్థ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

అనుబంధం

క్రసం.

రాష్ట్రం

ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య

నిర్మించిన గోదాంల సంఖ్య

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్

117

117

-

2

బీహార్

36

-

5

3

ఉత్తర ప్రదేశ్

14

1

-

4

మధ్యప్రదేశ్

1

1

-

మొత్తం

 

168

119

5


 

అనుబంధంబీ

క్ర.సం.

రాష్ట్రం

ప్యాక్స్‌లు

గోదాంలు

యంత్ర పరికరాల అద్దె కేంద్రాలు

చౌక ధరల దుకాణాలు

1

ఆంధ్రప్రదేశ్

685

6

71

2

బీహార్

5828

2659

3752

3

మధ్యప్రదేశ్

2032

87

4012

4

ఉత్తర ప్రదేశ్

1862

169

212


 

అనుబంధంసీ

క్రసం.

రాష్ట్రం

ప్రాజెక్టుల సంఖ్య

మొత్తం ముందస్తు సబ్సిడీ (రూకోట్లలో)

1

బీహార్

25

5.06

2

మధ్యప్రదేశ్

1

0.13

3

ఉత్తర ప్రదేశ్

1

0.05

ఈ సమాచారాన్ని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.


***


(रिलीज़ आईडी: 2294675) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी