ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య150 వ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

प्रविष्टि तिथि: 02 AUG 2026 8:38PM by PIB Hyderabad

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య పోషించిన అమూల్యమైన పాత్రను ప్రధానమంత్రి స్మరించుకున్నారుఆయన కృషి... అంకితభావందేశభక్తితో దేశానికి సేవలు అందించేలా ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

త్రివర్ణ పతాకం... ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతో నిండిపోయేలా చేస్తుందనీదేశ నిర్మాణానికి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందనీ శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘
పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా వారికి నివాళులుమన దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో ఆయన పోషించిన అమూల్యమైన పాత్రకు ఆయన చిరస్మరణీయులుఅంకిత భావందేశభక్తితో దేశానికి సేవలు అందించేలా ఆయన కృషి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తిని అందించుగాక!

త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుని హృదయాన్ని అపారమైన గర్వంతో నింపుతుందిదేశ నిర్మాణానికి కృషి చేసేలా మనకు స్ఫూర్తినిస్తుంది.” 

 

***


(रिलीज़ आईडी: 2293731) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam