ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల 5,000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందన
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:03PM by PIB Hyderabad
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో 2026లో పురుషుల 5,000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ అద్భుత ప్రదర్శనతో ఒకే కామన్వెల్త్ క్రీడల్లో రెండు అథ్లెటిక్స్ పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 5,000 మీటర్ల పరుగుపందెంలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా కూడా గుల్వీర్ సింగ్ నిలిచారని ఆయన తెలిపారు.
గుల్వీర్ సింగ్ సాధించిన ఈ ఘనత భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుల్వీర్ సింగ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
"గుల్వీర్ సింగ్ తన విజయంతో చరిత్ర సృష్టించారు. 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 5000 మీటర్ల పరుగు విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆయనకు అభినందనలు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో, ఒకే కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఆయన నిలిచారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో కామన్వెల్త్ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. ఇది నిజంగా భారతీయ అథ్లెటిక్స్ రంగానికి ఒక అద్భుతమైన విజయం. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2293348)
आगंतुक पटल : 8